వివాదాల దర్శకుడికి దేహ శుద్ది చేసిన ఆ అపరిచితులెవరు...!?
తమిళంలో ఓ సినిమా రూపొందుతోంది. ఆ సినిమా కథ ప్రకారం మామయ్యను కోడలు ప్రేమిస్తుంది. ఈ కథాంశంతో చిత్రాన్ని రూపొందిస్తున్నది వివాదస్పద దర్శకుడు సామి. ఇతగాడు గతంలో సంగీత వదిన పాత్రధారిగా తన మరిదితో ప్రేమలో పడేట్లు 'ఉయిర్" అనే సినిమాకి దర్శకత్వం వహించాడు. అప్పట్లో ఈ పాయింట్ వివాదమయ్యింది.
ఇప్పుడ ఏకంగా కోడలు, మామప్రేమలో పడే కథతో సినిమా రూపొందిస్తున్నాడని తెలిసి ఈ సినిమా విడుదల సమయంలో వివాదం సృష్టించాలని కొన్ని స్వచ్చంద సంస్థలు రెడీ అవుతున్నాయి. సమాజాన్ని భ్రష్టు పట్టించే ఇలాంటి కథతో సినిమా తీసినందుకు కొంతమంది ఈ దర్శకుడు ఇంటి మీద దాడి చేసి చితక బాధారని సమాచారం.
గతంలో ఇదే దర్శకుడు ఓ సినిమా షూటింగ్ లో హీరోయిన్ పద్మప్రియ చెంప చెళ్లుమనిపించాడు. దాంతో సామికి ఇప్పుడు ఇలా జరగినందుకు పద్మప్రియ సంతోష పడిపోతుందని పరిశీలకులు అనుకున్నారు. కానీ ఎంత రాంగ్ కాస్సెప్ట్ తో సినిమా తీస్తే మాత్రం అలా ఇంటి మీద దాడి చేయడం కరెక్ట్ కాదని పద్మప్రియ పేర్కొంది. ఏదో తనని కొట్టాడు కదాని ఇప్పుడు సామికి జరిగిన అవమానం గురించి నేను సంతోషపడను. అది తన సంస్కారం కాదని కూడా పద్మప్రియ పేర్కొంది.


Click it and Unblock the Notifications











