twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినీ పరిశ్రమలో మరో విషాదం: ప్రముఖ డైరెక్టర్ తండ్రి కన్నుమూత

    |

    సినీ పరిశ్రమలో వరుసగా విషాదకర సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. దేశంలోని పలు ఇండస్ట్రీలకు చెందిన వారిలో చాలా మంది ఇప్పటికే కరోనా మహమ్మరి కారణంగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో తమిళ సినీ పరిశ్రమలో మరో విషాదం అలముకుంది. ప్రముఖ దర్శకుడు శివ తండ్రి జయకుమార్ అనారోగ్య కారణాలతో తుది శ్వాస విడిచారు. ఆయన మరణంపై స్టార్ హీరోలు రజినీకాంత్, అజిత్ కుమార్ సహా పలువురు నటులు సంతాపం తెలియజేశారు.

    తమిళ, తెలుగు సినీ పరిశ్రమల్లో ఎన్నో సినిమాలు తెరకెక్కించాడు దర్శకుడు శివ. ఆయన తండ్రి జయకుమార్ కూడా పలు షార్ట్ ఫిల్మ్‌లు తీశాడు. అలాగే, కొన్ని డాక్యూమెంటరీలను సైతం రూపొందించారు. ఇలా దాదాపు 400 పైగా ఫిల్మ్స్‌లో భాగం అయ్యారు. ఇక, కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన శనివారం ఉదయం ప్రముఖ హాస్పిటల్‌లో కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ఆయన అంత్యక్రియలు సైతం శనివారమే జరపనున్నారు. ఆయన మృతిపై తెలుగు సినీ ప్రముఖులు సైతం ప్రగాడ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.

    Tamil Director Siva Father passes away

    గోపీచంద్ నటించిన 'శౌర్యం' అనే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు శివ. ఆ తర్వాత తెలుగులో కొన్ని సినిమాలను తెరకెక్కించాడు. అవి నిరాశ పరచడంతో తమిళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ విక్రమార్కుడు రీమేక్ 'సిరుత్తై'తో హిట్ అందుకుని.. ఆ తర్వాత అజిత్ కుమార్‌తో 'వీరం', 'వేదాళం' వంటి పవర్‌ఫుల్ సినిమాలు తెరకెక్కించాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం రజినికాంత్‌తో 'అన్నాత్తె' అనే మూవీ తెరకెక్కిస్తున్నాడు. దీని తర్వాత శివ... జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది.

    English summary
    Sivakumar Jayakumar, known professionally as Siva or Siruthai Siva, is an Indian filmmaker who has worked in Tamil and Telugu cinema as a film director and cinematographer. Since his Tamil directorial debut, Siruthai (2011), the media has often incorporated the film's title in his name to refer to him.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X