నగ్నంగా నటిస్తావా.... నిన్ను బ్రతకనివ్వం, చంపితీరుతాం: హీరోయిన్‌కు బెదిరింపులు!

By Bojja Kumar

Recommended Video

Actress Dhanya Got Warning Calls From Unknown

తమిళ సినీ నటి ఎన్ ధన్య అలియాస్ రఫియా భాను గురువారం చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మే 14, మే 16వ తేదీల్లో తనకు గుర్తు తెలియని వ్యక్తుల నుండి కాల్స్ వచ్చాయని, చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 18-05-2009 అనే సినిమాలో నగ్నంగా నటించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ బెదిరింపులకు పాల్పడుతున్నారని, తనకు రక్షణ కల్పించాలని ధన్య పోలీసులను కోరారు.

నగ్నంగా నటించడంపై బూతులు తిడుతూ బెదిరింపులు

నగ్నంగా నటించడంపై బూతులు తిడుతూ బెదిరింపులు

చెన్నైలోని వడపలని ప్రాంతంలో అద్దెఇంట్లో నివాసం ఉంటున్న ధన్యకు మే 14వ తేదీ రాత్రి 1.15 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి నుండి (నెం. 447404617369) కాల్ వచ్చింది. "18-05-2009" మూవీలో నగ్నంగా నటించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సదరు వ్యక్తి బూతులు తిట్టినట్లు ఆమె ఆరోపించారు. మరోసారి 16 తేదీ ఉదయం 5 గంటలకు ఇలాంటి కాల్ మరోసారి వచ్చిందని ధన్య ఫిర్యాదులో పేర్కొన్నారు.

 సినిమా కథ ప్రకారమే అలా నటించాను

సినిమా కథ ప్రకారమే అలా నటించాను

తనను బెదిరింపులకు పాల్పడిన వ్యక్తికి ఒకటే చెప్పాను. నేను కేవలం నటిని, దర్శకుడు చెప్పినట్లు చేయడమే నా పని. స్క్రిప్టు డిమాండ్ మేరకే అలా నటించాల్సి వచ్చింది. ఏమైనా అభ్యంతరం ఉంటే దర్శకుడితో మాట్లాడాలని చెప్పినా ఫోన్లోని వ్యక్తి వినిపించుకోలేదని ధన్య తెలిపారు.

నిషేదిత చిత్రంలో నటించిన ధన్య

నిషేదిత చిత్రంలో నటించిన ధన్య


ఎల్‌టీటీఈ నేపథ్యంలో సాగే ‘పోర్కలథిల్ ఓరు పూ' అనే మూవీలో ధన్య లీడ్ రోల్ చేశారు. శ్రీలంకలో జరిగిన సివిల్ వార్‌లో లంక ఆర్మీ చేతిలో దారుణంగా రేప్ చేయబడి, హత్యకు గురైన టెలివిజన్ జర్నలిస్ట్ ఇసాయిప్రియ జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కించారు. ఇందులో ఆమె ఇసాయిప్రియ పాత్ర పోషించారు. ఈ చిత్రాన్ని భారత్‌లో నిషేదించారు.

ఎల్‌టీటీఈ నేపథ్యంలో మరో మూవీ

ఎల్‌టీటీఈ నేపథ్యంలో మరో మూవీ

మరో వైపు ఆమె నటించిన "18-05-2009'' మూవీ త్వరలో విడుదలవుతోంది. ఈ మూవీ కూడా ఎల్‌టీటీఈ నేపథ్యంలో సాగే చిత్రమే కావడం గమనార్హం. వివాదాస్పద చిత్రం కావడం వల్లనే ఆమెకు బెదిరింపు కాల్స్ వచ్చినట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X