"ఇండియన్ 2", "కంగువా" భారీ నష్టాలు.. వారిపై థియేటర్ ఓనర్స్ వేటు

ప్రస్తుత రోజుల్లో పలు చిత్రాల విషయంలో థియేటర్స్ కి జనాన్ని రప్పించడానికి దర్శక నిర్మాతలు పడుతున్న పాట్లు అన్ని ఇన్ని కాదు. ఓ పక్క ఓటిటిలు మరోపక్క సోషల్ మీడియాలో ఎవరు పడితే వారు సినిమాలు చూడకుండానే రివ్యూస్ కూడా ఇచ్చేస్తున్నారు.

దీనితో సినిమాలు థియేటర్స్ లో చూసేవారి శాతం నానాటికీ తగ్గుతూ వస్తుంది అని చెప్పొచ్చు. అయితే ఇది అన్ని సినిమాలు అన్ని సమయాల్లో ఉంటుందా అంటే ఖచ్చితంగా కాదని కూడా చెప్పలేం. కొన్ని చిత్రాలకి నెగిటివ్ టాక్ పడినప్పటికీ రివ్యూస్ కి కూడా సంబంధం లేకుండా సినిమాలు రన్ అవుతాయి. ఇంకా కొన్ని సినిమాలు అయితే కొన్నాళ్ళకి దీనిని థియేటర్స్ లో ఎలా హిట్ చేశారు అనే మాటలు కూడా వినిపిస్తాయి.

tamil film chamber takes shocking decision with indian 2 kanguva loses

కాగా మన తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఒకలా ఉంటే మన పొరుగునే ఉన్న తమిళనాడులో థియేటర్స్ పరిస్థితి మరోలా ఉందని చెప్పాలి. అక్కడ చాలా వరకు మన దగ్గరలా బెనిఫిట్ షోస్ టికెట్ ధరల హైక్ లు లాంటివి ఉండవు. అయినా కూడా తమిళ చిత్ర పరిశ్రమలో మంచి మార్కెట్ ఉంటే చాలా మంది హీరోస్ మంచి నంబర్స్ నమోదు చేస్తారు. అయితే ప్రస్తుతం పరిస్థితి దారుణంగా ఉందని థియేటర్స్ యాజమాన్యం వాపోతున్నారు.

తమిళనాట ఈ ఏడాది పలు భారీ సినిమాలు విడుదలయ్యాయి. ఆ చిత్రాలు ప్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఆయా సినిమాల ఫలితాలు మాత్రం కొందరి వల్ల మరింత నష్టాలు ఎదుర్కొంటున్నామని థియేటర్స్ వారు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో కోలీవుడ్ ఫిలిం ఛాంబర్ సంచలన నిర్ణయం తీసుకుంది.

tamil film chamber takes shocking decision with indian 2 kanguva loses

పలు భారీ చిత్రాలకి యూట్యూబ్ రివ్యూ వాళ్ళని, అలాగే కొందరు మీడియా వాళ్ళని మొదటి రోజు థియేటర్స్ లోకి అనుమతించకూడదని హుకుం జారీ చేసింది. వారు ఇచ్చే రివ్యూల మూలాన థియేటర్స్ కి జనం రావడం మానేస్తున్నారని , వారి వల్ల చాలా నష్టం చూస్తున్నామని ఈ క్రమంలోనే అలాంటి వారిని అనుమతించేది లేదని పేర్కొంది.

కాగా ఇటీవల భారతీయుడు 2, మొన్న రీసెంట్ గానే వచ్చిన కంగువా సినిమాలకి యూట్యూబ్ , సోషల్ మీడియా రివ్యూల వల్ల చాలా నష్టాలు చూసామని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా వారు తెలిపారు. అయితే ఇది ఎంతవరకు సాధ్యపడుతుందో ఏమో కానీ ఓ కొత్త సినిమా రిలీజ్ వస్తే జనరల్ ఆడియెన్స్ ఎవరో? యూట్యూబర్లు ఎవరో? అని ఎలా తెలుసుకుంటారు అనేది చర్చనీయాంశమైంది.

అయితే కోలీవుడ్ ఫిలిం ఛాంబర్ తీసుకున్న నిర్ణయం అమలు చేయడం దాదాపు అసాధ్యమేనని చెప్పక తప్పదు. తెలుగు చిత్ర పరిశ్రమలోనూ ఈ తరహా విధానాన్ని అమలు చేయాలని కొందరు యువ హీరోలు, నిర్మాతలు ఎప్పుడో చెప్పారు. సినిమా రిలీజ్ రోజు కాకుండా రెండు మూడు రోజుల తర్వాత క్రిటిక్స్ రివ్యూస్ ఇవ్వాలని చాలానే చేశారు కానీ ఇవేవి పెద్దగా అమలు లోకి రాలేదు.

More from Filmibeat

Read more about: kollywood indian 2 kanguva
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X