twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రముఖ తమిళ దర్శకుడు కన్నుమూత

    By Srikanya
    |

    చెన్నై: ప్రముఖ తమిళ చిత్ర దర్శకులు అమీర్‌జాన్‌ చెన్నైలో మంగళవారం కన్నుమూశారు. ఆయన వయసు 73. 'పూవిలంగు' చిత్రం ద్వారా దర్శకుడిగా 1984లో అమీర్‌జాన్‌ చిత్రపరిశ్రమకు పరిచయమయ్యారు. మురళి, కుయిలి జంటగా నటించిన ఈ చిత్రానికి ఇళయరాజా స్వరాలు సమకూర్చారు. దర్శకులు బాలచందర్‌ నిర్మించారు. తొలిచిత్రమే అమీర్‌జాన్‌కు ఎనలేని గుర్తింపును తీసుకొచ్చింది.

    అలాగే రజనీకాంత్‌ నటించిన 'శివ', విజయకాంత్‌ హీరోగా 'వాళవేండుం', కార్తీక్‌ హీరోగా 'వన్న కనవుగల్‌', ప్రకాష్‌రాజ్‌ నటించిన 'చిన్న చిన్న కన్నిలే' చిత్రాలకు దర్శకత్వం వహించారు. 'పుదియవన్‌', 'ధర్మపత్తిని', 'నట్పు' వంటి పలు చిత్రాలు ఆయనకు గుర్తింపు తెచ్చాయి. అమీర్‌జాన్‌కు కొన్ని వారాల క్రితం పక్షవాతం సోకడంతో ఆస్పత్రిలో చేర్పించారు. పది రోజుల క్రితమే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.

    Tamil Film Director Ameerjan Dies at 73

    ఈ నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు మళ్లీ సమస్య రావడంతో ఆయనను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఇంతలోనే ఆయన తుదిశ్వాస విడిచారు.

    అమీర్‌జాన్‌ భౌతికకాయాన్ని సినీ ప్రముఖులు, బంధువుల సందర్శనార్థం సాలిగ్రామంలోని స్వగృహంలో ఏర్పాటు చేశారు. బుధవారం అంత్యక్రియలు జరుగనున్నాయి. అమీర్‌జాన్‌కు భార్య మహబుల్‌జాన్‌, కుమారుడు దౌలత్‌ బాషా, కుమార్తె ఆయేషా బానులు ఉన్నారు.

    English summary
    Veteran film-maker Ameerjan (Amirjaan) passed away on Tuesday, 17 March, at his residence in Chennai. A few days ago, he was admitted to a private hospital following cardiac arrest. He was 73.His debut film was Murali-Kuyili starrer "Poovilangu" in 1984.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X