»   »  రోడ్డు ప్రమాదంలో దర్శకుడి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో దర్శకుడి దుర్మరణం

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: తమిళ సినీ ప్రముఖ డైరెక్టర్‌ దేవరాజు(60) కర్నూలు జిల్లా డోన్‌ హైవే ఓబులాపురం మిట్ట వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కోయంబత్తూరు నుంచి దేవరాజు తన స్నేహితులతో కలిసి బెంగుళూరు మీదుగా హైదరాబాద్‌ వస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

ఓబులాపురం మిట్ట హైవే వద్ద కారు ప్రమాదానికి గురైంది. దేవరాజును వెంటనే మృతదేహాన్ని డోన్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు గుర్తించారు. అనంతరం ఆయన భౌతిక కాయాన్ని కోయంబత్తూరుకు తరలించారు. కారులో ప్రయాణిస్తున్న మిగతా వారికి స్వల్ప గాయాలయ్యాయి.

Tamil Film Director Devaraju dies in road mishap

తమిళంలో సింధూరపువ్వు వంటి హిట్‌ చిత్రాలను అందించిన దేవరాజు మూడు దశాబ్దాలపాటు తమిళంలో ఎన్నో సినిమాలకు డైరెక్టర్‌గా పనిచేసి ప్రేక్షకుల్లో ఆదరణ పొందారు.

ప్రస్తుతం తమిళంలో సీరియల్స్‌కు డైరెక్టర్‌గా పనిచేస్తూ విశేష ప్రేక్షక అభిమానాన్ని చురగొన్నారు. అయితే రోడ్డుప్రమాదం రూపంలో దేవరాజు మృత్యువు కబళించడంతో.. తమిళ సినీలోకం ఒక మంచి డైరెక్టర్‌ను కోల్పోయింది.

English summary
Tamil film director Devaraju (60) died at Dhone in Kurnool district of Andhra Pradesh on Monday in a road mishap.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu