twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రముఖ తమిళ దర్శకుడు గోపాలకృష్ణన్ మృతి

    By Bojja Kumar
    |

    చెన్నై: ప్రముఖ తమిళ దర్శకుడు, స్క్రీన్ రైటర్, ప్రొడ్యూసర్ కె.ఎస్. గోపాలకృష్ణన్(86) మృతిచెందారు. తమిళ, మళయాళం, హిందీ సినిమాల్లో 70 చిత్రాలకు గోపాలకృష్ణన్ దర్శకత్వం వహించారు. శారద, కర్పగం, కునమ వంటి పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్సపొందుతూ మృతిచెందారు.

    Tamil film director K.S. Gopalakrishnan passes away

    గోపాల కృష్ణ తమిళ సినిమా రంగంలో దిగ్గజాలైన శివాజీ గణేషన్‌, జెమినీ గణేశన్‌, జయలలిత వంటి వారి చిత్రాలకు పనిచేశారు. సాంఘీక, ఆధ్యాత్మిక చిత్రాలను తెరకెక్కించడంలో కె.ఎస్. ప్రసిద్ధి. ఎక్కువ సినిమాలు మెలోడ్రామాగా వచ్చాయి. తమిళనాడు ప్రభుత్వం గోపాలకృష్ణన్‌ను కలైమణి అవార్డుతో సత్కరించింది. కె.ఎస్ మృతిపట్ల తమిళ చిత్ర ప్రముఖులంతా తమ సంతాపం తెలిపారు.

    English summary
    Noted yesteryear Tamil film director-cum-lyricist and producer K S Gopalakrishnan passed away in a private hospital here on Saturday night. He was 86 and is survived by six sons.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X