ముగిసిన తమిళ సినీ పరిశ్రమ సమ్మె: ‘భరత్ అనే నేను’కు లైన్ క్లియర్
తమిళనాడులో దాదాపు 50 రోజులుగా కొనసాగుతున్న సినీ పరిశ్రమ సమ్మె ముగిసింది. తమిళ సినీ నిర్మాతల మండలి, థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్, డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ కలిసి ఏప్రిల్ 17న జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. దీంతో ఏప్రిల్ 20వ తేదీ నుండి తమిళనాడు వ్యాప్తంగా సినిమాలు ప్రదర్శితం కానున్నాయి.
డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు వర్చువల్ ఫ్రింట్ ఫీజు తగ్గించడానికి అంగీకరించడమే ఈ సమ్మె ముగియడానికి ప్రధాన కారణం అని తెలుస్తోంది. నటుడు, నిర్మాత విశాల్ నేతృత్వంలో జరిగిన ఈ చర్చల్లో తమ తమ డిమాండ్స్ నెరవేరడంతో అందరూ సమ్మె విరమించడానికి అంగీకరించారు.

సమ్మె కారణంగా తమిళనాడులో పలు పెద్ద సినిమాల విడుదల వాయిదా పడింది. రజనీకాంత్ కాలా, కమల్ హాసన్ విశ్వరూపం 2, కార్తీక్ సుబ్బరాజ్ మెర్వ్కూరీ చిత్రాలు ల్యాబుల్లోనే ఉండిపోయాయి. దీంతో పాటు చాలా చిన్న సినిమాల విడుదల పెండింగులో పడిపోయింది. ఆ సినిమాలన్నీ తమిళనాడులో వరుస పెట్టి విడుదల కానున్నాయి.
కాగా...సమ్మె ముగియం వల్ల మహేష్ బాబు మూవీ 'భరత్ అనే నేను' చిత్రానికి లైన్ క్లియర్ అయినట్లయింది. తమిళనాడులో కూడా మహేష్ బాబుకు భారీగా అభిమానులు ఉన్నాయి. ఇపుడు అంతా క్లియర్ కావడంతో ఈ చిత్రాన్ని అక్కడ కూడా భారీగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











