For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Oscar 2022 : బరిలో నయనతార, విఘ్నేష్ శివన్‌ల ‘కూజంగల్’.. ఏమేం సినిమాలు పోటీ పడ్డాయి అంటే?

  |

  సినిమా జనం అంతా ఆసక్తిగా ఎదురు చూసే విషయం ఏదైనా ఉందా అంటే? అది ఆస్కార్ అవార్డుల కార్యక్రమం. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూసే అవార్డు వేడుకల్లో ఆస్కార్ ముందు వరసలో ఉంటుంది. హాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా నటీనటులు అందరూ జీవితంలో ఒకసారైనా ఆస్కార్ అవార్డు అందుకోవాలని కలలు కంటూ ఉంటారు. ఇక తాజాగా నయనతార సినిమా ఒకటి ఆస్కార్ బరిలో నిలిచింది. ఆ వివరాల్లోకి వెళితే

  ఆస్కార పండుగ

  ఆస్కార పండుగ

  సినీ ప్రపంచంలోనే అత్యున్నత అవార్డుగా భావించే అకాడమీ అవార్డులను ప్రతి యేడాది ఫిబ్రవరి చివరి వారంలో ఇవ్వడం ఆనవాయితీ. కానీ యేడాది (2021)లో ఈ అవార్డు వేడుకలను కరోనా మహామ్మారి కారణంగా రెండు నెలలు పాటు వాయిదా వేసి ఏప్రిల్‌లో అవార్డులు ప్రధానం చేశారు. ఇక 2022 బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కెేటగిరిలో పోటీ పడేందకు మన భారత దేశం తరుపున అధికారిక ఎంట్రీ కోసం కొన్ని సినిమాలు పోటీ పడ్డాయి. ఆస్కార్ లిస్ట్‌లో కేంద్రం 15 మంది సభ్యులతో ఓ ఆస్కార్ జ్యూరీని ఏర్పాటు చేసింది. ఇందులో మన భారత్ నుంచి ఎంపిక చేసిన 14 సినిమాలను చూసి ఫైనల్‌గా ‘కూజంగల్' మూవీని మన దేశం తరుపున ఉత్తమ విదేశీ చిత్రాల కేటగిరిలో అధికారిక ఎంట్రీగా ఫిక్స్ చేశారు.

  హీరోయిన్ గా కాదు

  హీరోయిన్ గా కాదు

  ‘కూజంగల్' సినిమాను నయనతార, విఘ్నేష్ శివన్ కలిసి రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించారు. ఇప్పటికే ఈ మూవీ ప్రఖ్యాత ప్రెస్టీజియస్ టైగర్ అవార్డు ఫిల్మ్ ఫెస్టివల్‌కు కూడా ఎంపికైంది. అలాగే 50వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా ప్రదర్శించారు. రియలిస్టిక్ డ్రామా అయిన ఈ సినిమాలో చెల్లపండి, కరుత్తాదైయాన్ ముఖ్యపాత్రల్లో పోషించారు. పి.ఎస్. సంతోష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ఆస్కార్ బరిలో ఈ సినిమా అధికారికంగా ఎంపికైన నేపథ్యంలో సినిమా నిర్మాత విఘ్నేష్ శివన్ ఆస్కార్‌కు రెండడుగుల దూరం ఉందంటూ తన సంతోషాన్ని షేర్ చేసుకన్నారు.

  షేర్ని- సర్దార్ ఉధమ్ సింగ్

  షేర్ని- సర్దార్ ఉధమ్ సింగ్


  ఆస్కార్ బరిలో ఈ సినిమా మాత్రమే కాక దేశం తరుపున విద్యాబాలన్ ముఖ్యపాత్రలో నటించిన ‘షేర్నీ' మూవీతో పాటు విక్కీ కౌశల్ నటించిన ‘సర్ధార్ ఉధమ్ సినిమాలను కూడా షార్ట్ లిస్ట్ చేశారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ రెండు సినిమాలు థియేటర్స్‌లో విడుదల కాకుండా.. నేరుగా అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలై మంచి టాక్ సొంతం చేసుకున్నాయి.

  ఆ సినిమాలు కూడా

  ఆ సినిమాలు కూడా


  ఆస్కార్ రేసులో ‘షేర్నీ' ‘సర్ధార్ ఉధమ్'లతో పాటు తమిళ సినిమా 'మండేలా', మలయాళం మూవీ నాయాట్టూ కూడా పోటీ పడ్డాయి. కానీ ఫైనల్‌గా ‘కూజంగల్' మూవీ మన దేశం తరుపున ఆస్కార్ బరిలో షార్ట్ లిస్ట్ అయింది. ఈ అవార్డు వేడుకలను 2022 మార్చిలో ప్రధానం చేయనున్నారు.

  వస్తుందేమో చూడాలి

  వస్తుందేమో చూడాలి


  ఇక ఇప్పటి వరకు ఆస్కార్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరిలో మన దేశం నుంచి ‘మదర్ ఇండియా', ‘సలాం బాంబే', ‘లగాన్' సినిమాలు మాత్రమే ఫైనల్ లిస్ట్‌లో నామినేషన్ దక్కించుకున్నాయి. కానీ ఈ సినిమాల్లో ఒక్కదానికి కూడా ఆస్కార్ అవార్డులు రాలేదు. ఈ సారైనా మన భారతీయ చిత్రం ఏదైనా విదేశీ కేటగిరిలో ‘కూజంగల్' అవార్డు సాధిస్తుందేమో చూడాలి.

  English summary
  Nayanathara- Vignesh shivan's produced Debutant director PS Vinothraj’s Tamil film Koozhangal has been announced as India’s official entry to the Oscars 2022.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X