twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    80 కోట్ల విగ్రహాల స్మగ్లింగ్‌ కేసు: ప్రముఖ సినీ నిర్మాత అరెస్టు

    By Srikanya
    |

    చెన్నై : విగ్రహాల స్మగ్లింగ్‌ వ్యవహారంలో ప్రముఖ తమిళ సినీ నిర్మాత వి.శేఖర్‌ను అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... కేకే నగర్‌లోని శేఖర్‌ ఇంటిలో ఎనిమిది పంచలోహ విగ్రహాలను ఆయన భద్రపరచుకున్నాడు. వాటి విలువ రూ. 80 కోట్లు. చోరీకి సంబంధించి కొందరికి ఆశ్రయం కల్పించారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    విగ్రహాల విభాగానికి చెందిన అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ ప్రదీప్‌ వి.ఫిలిప్‌ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం ఆయన్ను అరెస్టు చేసింది. పదకొండు మంది సభ్యులతో పాటు కళాశాల విద్యార్థికి కూడా దీంతో సంబంధముంది. మేలో వెస్ట్‌మాంబళంలో జరిపిన తనిఖీలో ఆటోలో గోనెసంచులతో అనుమానంతో ప్రయాణిస్తున్న సినిమా ప్రొడక్షన్‌ మేనేజర్‌ ధనలింగాన్ని అరెస్టు చేశారు.

    Tamil film producer V Sekar arrested for idol theft

    అప్పుడు పంచలోహ విగ్రహాలు లభ్యమయ్యాయి. వి.శేఖర్‌ తమిళంలో ప్రముఖ నిర్మాత. 'తిరువళ్లువర్‌ కలైకూడం' అనే నిర్మాణ సంస్థ నడుపుతున్నారు. గత జనవరి ఆరో తేదీన శ్రీపెరుంబుదూరులోని మణికంఠేశ్వర ఆలయం నుంచి 20 కిలోల శివపార్వతుల పంచలోహ విగ్రహాలు, నాలుగు రోజుల అనంతరం పయ్యూరు, కాంచీపురంలలోని నాలుగు దేవాలయాల నుంచి ఏడు పంచలోహ విగ్రహాలు చోరీకి గురయ్యాయి.

    అనంతరం వాటిని వెస్ట్‌మాంబళంలో జరిపిన సోదాలో ధనలింగం నుంచి స్వాధీనం చేసుకున్నారు. అతడి ఇద్దరు అనుచరులను కూడా అరెస్టు చేశారు. శేఖర్‌ను ఎగ్మూరులోని మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరు పరిచిన అనంతరం పుళల్‌ జైలుకు తరలించారు.

    English summary
    Police in Tamil Nadu have arrested veteran film maker V Sekar for allegedly stealing temple idols worth Rs 80 crore to make up for the losses from a film starring his son.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X