twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరో విశాల్ మీద దారుణమైన ఆరోపణలు, తెలుగువాడు కావడంతో టార్గెట్!

    By Bojja Kumar
    |

    Recommended Video

    హీరో విశాల్ మీద దారుణమైన ఆరోపణలు, తెలుగువాడు కావడంతో టార్గెట్!

    తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు, నటుడు విశాల్ మీద ఆయన వ్యతిరేక వర్గం విరుచుకుపడింది. నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఉన్న విశాల్ పైరసీ అరికట్టడంలో ఫెయిలయ్యాడని, వెంటనే ఆయన ఈ పదవి నుండి తప్పుకోవాలనే డిమాండ్ చేశారు. విశాల్ ఒక తెలుగు వాడని, తమిళుడి చేతిలో నిర్మాతల మండలి ఉండాలని, అప్పుడే ఇక్కడి నిర్మాతలకు న్యాయం జరుగుతుందంటూ డిమాండ్ చేశారు. అంతే కాదు.... లైకా ప్రొడక్షన్స్ సంస్థతో విశాల్ డీల్ కుదుర్చుకున్నాడని, అందుకే పైరసీ‌పై కఠినంగా వ్యవహరించడం లేదని ఆరోపించారు.

     విశాల్‌ వ్యతిరేక వర్గం మీటింగ్

    విశాల్‌ వ్యతిరేక వర్గం మీటింగ్

    విశాల్ వ్యతిరేక వర్గంగా పేరొందిన ప్రముఖ దర్శకుడు భారతీ రాజా, నటుడు టి రాజేందర్, జెకె రితేష్, మరికొందరు తమిళ సినీ నిర్మాతలు ఆదివారం చెన్నైలో సమావేశం అయ్యారు. తమిళ సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా విశాల్ సాధించింది ఏమీ లేదని, పైరసీ అరికడతాననే హామీతో పాటు చాలా విషయాల్లో ఫెయిల్ అయ్యాడని ఆరోపించారు.

    లైకా ప్రొడక్షన్స్‌తో డీల్?

    లైకా ప్రొడక్షన్స్‌తో డీల్?

    ఇటీవల ఓ తమిళ వెబ్ సైట్ లైకా ప్రొడక్షన్స్ మీద ఆరోపణలు చేస్తూ ఓ కథనం వెలువరించింది. దాదాపు 40 పైరసీ వెబ్ సైట్ల వెనక ‘లైకా ప్రొడక్షన్స్' హస్తం ఉందని తన కథనం సారాంశం. ఈ విషయం ఓ ప్రైవేట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ద్వారా విశాల్ తెలుసుకున్నాడని, లైకా ప్రొడక్షన్స్‌ను సంప్రదించి డీల్ కుదుర్చుకున్నాడని, అందులో భాగంగానే ఆ సంస్థ విశాల్ తాజా సినిమా ఇరుంబు తిరై చిత్రాన్ని నిర్మించిందని అనుమానాలు వ్యక్తం చేస్తూ సదరు వెబ్ సైట్ కథనం వెలువరించింది.

     సినిమాలు నిర్మించని నువ్వు అధ్యక్షుడిగా ఎలా ఉంటావు?

    సినిమాలు నిర్మించని నువ్వు అధ్యక్షుడిగా ఎలా ఉంటావు?

    ఈ మధ్య కాలంలో విశాల్ అసలు సినిమాలేవీ నిర్మించడం లేదని, అలాంటపుడు విశాల్ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఎలా ఉంటాడు? అంటూ మీడియా సమావేశంలో నిర్మాత కె రాజన్ ప్రశ్నించారు.

    విశాల్‌ ఇష్టారాజ్యం నడుస్తోంది

    విశాల్‌ ఇష్టారాజ్యం నడుస్తోంది

    తమిళ సినీ ఇండస్ట్రీలో విశాల్ ఇష్టా రాజ్యం నడుస్తోందని, అతడి చర్యల వల్ల చిన్న సినిమాలు నష్టపోతున్నాయని మరో నిర్మాత తిరుమలై ఆరోపించారు. విశాల్ నటించిన ‘ఇరుంబు తిరై' చిత్రాన్ని లైకా వారు నిర్మించారు, దీన్ని 300 థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించారు, అయితే విశాల్ మాత్రం మాత్రం 220 థియేటర్లలో మాత్రమే తన సినిమా రిలీజ్ అవుతుందని గతంలో అన్నారు. విశాల్ సహాయంతో లైకా వారు ‘కాలా' చిత్రాన్ని భారీగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. చిన్న సినిమాలకు థియేటర్ల దొరకడం సమస్యగా మారినా పట్టించుకోవడం లేదని మండి పడ్డారు.

     విశాల్ తెలుగు వాడు కావడంతో టార్గెట్

    విశాల్ తెలుగు వాడు కావడంతో టార్గెట్

    విశాల్ తెలుగువాడు కావడంతో అతన్ని టార్గెట్ చేశారు. దర్శకుడు భారతీరాజా మాట్లాడుతూ... ‘తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడిగా కేవలం తమిళులు మాత్రమే ఉండాలి' అని డిమాండ్ చేశారు.

     విశాల్ పూర్తిగా ఫెయిల్ అయ్యాడు

    విశాల్ పూర్తిగా ఫెయిల్ అయ్యాడు

    విశాల్ తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఎన్నికై 14 నెలలు అయిందని, ఇప్పటి వరకు అతడు ప్రామిస్ చేసిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. ఈ 14 నెలల కాలంలో విశాల్ తీసుకున్న నిర్ణయాల వల్ల ఇండస్ట్రీ చాలా నష్టపోవాల్సి వచ్చిందని ఆరోపించారు.

    English summary
    Tamil film producers meeting against TFPC president Vishal. In a reference to actor Vishal’s Telugu ancestry, director Bharathiraja said that only a Tamilian should head the TFPC. “It's been nearly 14 months since Vishal was elected to the TFPC. But he has not delivered on any of his promises. On the contrary, because of his decisions, the entire Tamil film industry has been held to ransom and has suffered losses." He said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X