twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    The Family Man 2ను నిషేధించండి... సమంత అక్కినేనికి తమిళ సర్కార్ షాక్!

    |

    అత్యంత ప్రేక్షకాదరణ పొందిన ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సీజన్ 2‌ వ్యవహారాన్ని తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ వెబ్ సిరీస్‌ను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకాశ్ జవదేకర్‌కు లేఖ రాసింది. తమిళుల మనోభావాలకు వ్యతిరేకంగా ఉందని ఈ వెబ్ సిరీస్‌పై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వివరాల్లోకి వెళితే...

    Recommended Video

    Family Man 2 రిలీజ్ చేస్తే తీవ్ర పరిణామాలు, రంగంలోకి TN Govt || Filmibeat Telugu
    తమిళ ఈలం పోరాటానికి వ్యతిరేకంగా

    తమిళ ఈలం పోరాటానికి వ్యతిరేకంగా


    ప్రకాశ్ జవదేకర్‌కు తమిళనాడు ప్రభుత్వం రాసిన లేఖలో.. ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్‌కు సంబంధించిన టైలర్‌ను ఇటీవల సోషల్ మీడియా నెట్‌వర్క్‌లో రిలీజ్ చేశారు. శ్రీలంకలోని చారిత్రాత్మక తమిళ ఈలం పోరాటానికి వ్యతిరేకంగా, అగౌరవ, కించపరిచే విధంగా ఉంది అంటూ లేఖలో ఘాటుగా స్పందించారు.

    ఎన్నో త్యాగాల పోరాటానికి వ్యతిరేకంగా

    ఎన్నో త్యాగాల పోరాటానికి వ్యతిరేకంగా


    ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నో త్యాగాలతో చేసిన పోరాటాన్ని ఉద్దేశపూర్వకంగా తప్పుడు రితీలో చిత్రీకరించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఊహాజనితమైన కథతో తమిళ సంస్కృతిని కించపరిచినట్టు స్పష్టమైంది. అంతేకాకుండా ప్రసార నిబంధనలకు విరుద్దంగా తమిళ సంస్కృతిని కించపరిచే విధంగా చిత్రీకరించినట్టు ఉంది అని లేఖలో తమిళ సర్కార్ పేర్కొన్నది.

    సమంతను తమిళ టెర్రరిస్టుగా

    సమంతను తమిళ టెర్రరిస్టుగా


    ప్రముఖ తమిళ నటి సమంతను టెర్రరిస్టుగా సీరియల్‌లో చూపించారు. ఆమె పాత్ర ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళులు, ారి జీవన విధానంపై డైరెక్ట్‌గా ఎటాక్ చేసినట్టు ఉంది. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని ఏమాత్రం ఉపేక్షించడం సరికాదు అని లేఖలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ సిరీస్‌పై తమిళనాడులోని రాజకీయ పార్టీలు, సాధారణ ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది అని స్పష్టం చేశారు.

    తమిళుల ఆత్మగౌరవానికి గొడ్డలిపెట్టు

    తమిళుల ఆత్మగౌరవానికి గొడ్డలిపెట్టు


    తమిళ ఈలం కోసం, స్వేచ్చా, న్యాయం, శాంతి, ఆత్మగౌరవం కోసం దశాబ్దాలుగా పోరాటం జరుగుతున్నది. అలాంటి పోరాటాన్ని కించపరిచే విధంగా చిత్రీకరించిన సిరీస్‌ను అమెజాన్ ప్రైమ్ లాంటి ప్రసారం చేయడం అభ్యంతరకరం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళుల ఆత్మగౌరవాన్ని కించపరిచినట్టే అని లేఖలో తమిళనాడు సర్కార్ తీవ్రంగా పరిగణించింది.

    అమెజాన్ ప్రైమ్‌లో నిషేధించండి

    అమెజాన్ ప్రైమ్‌లో నిషేధించండి


    ఇలాంటి భావోద్వేగ, ఆత్మగౌరవానికి పరీక్షగా నిలిచిన పరిస్థితుల్లో ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌ను నిషేధించండి. తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో విడుదల కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం అని కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో తమిళనాడు స్పష్టం చేసింది.

    English summary
    Tamil Govt writes to Modi Government to Ban on Samantha Akkineni's The Family Man 2 in OTT, Amazon Prime
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X