Hero Ajith కూతురిని చూసారా.. ఎంత అందంగా ఉందొ.. ఫ్యామిలీ ఫొటోస్ వైరల్!

కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎంత మంది స్టార్ హీరోలు ఉన్నా కూడా అందులో ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే చెప్పాలి. ఎవరికి వారు వారికంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ను కూడా క్రియేట్ చేసుకున్నారు. ఇక ఎలాంటి కాంట్రవర్సీలకు వెళ్లకుండా సైలెంట్ గా సినిమాలు చేసుకుంటూ ఉండే అతి కొద్దిమంది హీరోలలో అజిత్ కుమార్ ఒకరు. ఐదు పదుల వయసులో కి వచ్చినా కూడా అజిత్ కుమార్ యువ హీరోల తరహాలోనే మంచి ఫిట్నెస్ తో ముందుకు సాగుతున్నాడు. అతని స్టైలిష్ లుక్స్ కూడా నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక అజిత్ కుమార్ కూతురు ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అలాగే కుమారుడు భార్య శాలిని లతో దిగిన కొన్ని ఫోటోలు ఇంటర్నెట్ ప్రపంచంలో చక్కర్లు కొడుతున్నాయి. ఒకసారి ఆ వివరాల్లోకి వెళితే..

కంటెంట్ ఎలా ఉన్నా..

కంటెంట్ ఎలా ఉన్నా..


హాలీవుడ్ సినిమా ప్రపంచం లో ఎప్పటికప్పుడు స్టార్ హీరోల మధ్య పోటీ తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఇక అజిత్ అయితే గత కొంతకాలంగా కమర్షియల్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో వసూళ్లను సొంతం చేసుకుంటున్నాడు. కంటెంట్ ఎలా ఉన్నా నాలుగు యాక్షన్ సన్నివేశాలు ఉంటే చాలు బాక్సాఫీస్ వద్ద ఈజీగా 100కోట్లు రాబట్టగలడు.

ఎలాంటి కాంట్రవర్సీలకు వెళ్లకుండా..

ఎలాంటి కాంట్రవర్సీలకు వెళ్లకుండా..


ఇక అజిత్ కుమార్ ఎలాంటి కాంట్రవర్సీలకు వెళ్లకుండా తన పని తాను చేసుకుంటూ వెళతాడు. వీలైనంత వరకు అభిమానుల గ్రూపులకు అతను దూరంగానే ఉంటాడు. తన కారణంగా ఫ్యాన్స్ వారి విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దని నిత్యం చెబుతూనే ఉంటాడు. ఇక ఫ్యాన్స్ ను కూడా కలవడానికి ఎక్కువగా ఇష్టపడడు. కానీ అనుకోకుండా కలిస్తే మాత్రం వారితో ఫొటో దిగకుండా ఉండలేడు.

హీరోయిన్ తో పెళ్లి

హీరోయిన్ తో పెళ్లి

ఇక అజిత్ ఫ్యామిలీ విషయానికి వస్తే 2000వ సంవత్సరంలో హీరోయిన్ షాలినిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 1999లో అమర్ కలం సినిమాతో అజిత్ తో ప్రేమలో పడిన షాలిని చెన్నైలో ఆ మరుసటి ఏడాదిలోనే వివాహం చేసుకుంది. ఇక ఆమె పెళ్లి అనంతరం సినిమాలకు స్వస్తి చెప్పేసి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు.

 అవి తప్పితే..

అవి తప్పితే..

ఎలాంటి హడావుడి లేకుండా సింపుల్ గా పెళ్లి చేసుకున్న అజిత్ అనంతరం ఫ్యామిలీ లైఫ్ తోనే ఎక్కువగా బిజీ అయ్యేవారు. సినిమాలు లాంగ్ బైక్ రైడింగ్ లేదంటే ఫ్యామిలీతో కాలక్షేపం. ఇవి తప్పితే అజిత్ మరో విషయంలోకి వెళ్ళడు. అలాగే రాజకీయాలకు కూడా అతను చాలా దూరంగా ఉంటాడు.

 కొడుకు పుట్టినరోజు వేడుక

కొడుకు పుట్టినరోజు వేడుక

ఇక అజిత్ కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2008లో అనౌష్క జన్మించగా 2015లో అబ్బాయి అద్విక్ జన్మించాడు. ఇక వీరికి సంబంధించిన ప్రతీ సెలబ్రేషన్స్ లో అజిత్ పాల్గొంటారు. ఇక తన తదుపరి 61 సినిమా కోసం సెట్ చేసుకున్న లుక్ తో అజిత్ తన ఫ్యామిలీతో కలిసి ఫొటోలకు పోజులు ఇచ్చాడు. ఇక ప్రత్యేకంగా తన కుమారుడు అద్విక్ పుట్టినరోజు వేడుకను కూడా సెలబ్రేట్ చేశారు.

 కూతురితో అజిత్..

కూతురితో అజిత్..

ఇక అజిత్ కూతురు ఫొటోలు ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అజిత్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా సోషల్ మీడియాలో లేరు. కూతరి వయసు ప్రస్తుతం 14. విదేశాల్లో చదువును కొనసాగిస్తున్న ఆమె హఠాత్తుగా తండ్రితో కలిసి ఫొటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఇక ఆమెకి హీరోయిన్ షాలిని పొలికలతో అందంగా ఉందని కామెంట్స్ వస్తున్నాయి. మరి భవిష్యత్తులో నటిగా ఏమైనా ట్రై చేస్తుందో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X