For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అమ్మాయిలను పడేయటానికి స్టార్ హీరో చెప్పిన టెక్నిక్స్

  By Srikanya
  |
  చెన్నై : వరుడు చిత్రంతో తెలుగు వారికి పరిచయమైన తమిళ హీరో ఆర్య. కోలీవుడ్‌లో ఎక్కువమంది మహిళా అభిమానులను సొంతం చేసుకున్న స్టార్ హీరో ఆర్య అమ్మాయిలను పడేయటానికి సూత్రాలు చెప్తున్నాడు. 'అమ్మాయిలు ఓర చూపుతో, చిన్న నవ్వుతో అబ్బాయిల గుండెకు గాలం వేసేయగలరు. అదే మనమైతే వారి చుట్టూ చక్కర్లు కొట్టాలి. వారి అందంపై కవితలు గట్రా ప్రయోగిస్తే తప్ప దారిలో పెట్టలేము. నేను చెప్పే పది సూత్రాలు పాటిస్తే వంద శాతం కాకపోయినా దాదాపు వారిని ప్రేమవలలో పడేయొచ్చు' అంటున్నాడు ఆర్య.

  ఆయన చెప్తునన్న పది సూత్రాలేమిటంటే...

  1. మంచివాడిగా నటించకూడదు .... దేవదాసు కాలం నుంచి కూడా యువకులు అనుసరిస్తున్న వ్యూహం మంచివాడిగా నటించటం. ఇప్పుడివన్నీ కుదరవు. చాలా మంచివాడిని అని చెప్పేవారికన్నా, తనలోని చిన్నపాటి తప్పులను నిజాయతీగా ఒప్పుకునేవారికే అమ్మాయిలు మనసిచ్చేస్తున్నారు.

  2, అందం చూసి ఆందోళన వద్దు . అందమైన అమ్మాయి కదా! మనల్ని మెచ్చుతుందా అన్న ఆందోళన, అనుమానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనసులోకి రానివ్వకూడదు. తాను దేవతలా ఉన్నాను కదా అని సల్మాన్‌ఖాన్‌, శింబులాంటి వాల్లొచ్చి ఐ లవ్‌ యూ చెప్పాలని ఏ అమ్మాయి కోరుకోదు. తాను చదువుకుంటున్న, ఉద్యోగం చేస్తున్న ప్రాంతంలో ఉండేవారినే ఇష్టపడుతుంది. సో.. అవకాశాన్ని వదులుకోవద్దు.

  3. సుదూర ప్రయాణం. అందమైన అమ్మాయిని చూసిన వెంటనే ఐ లవ్‌ యూ చెప్పాలని అనిపించొచ్చు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చేయొద్దు. ఎందుకంటే ప్రేమన్నది సుదూర ప్రయాణం. అదే సమయంలో 'హృదయం'లో మురళిలా ఇష్టాన్ని వ్యక్తం చేయటాన్ని సాగదీయకూడదు. ఆ అమ్మాయి మననుంచి దూరమయ్యే పరిస్థితి కనిపిస్తే వెంటనే ప్రేమిస్తున్నానని చెప్పేయాలి.

  4. బలవంతం తగదు. మన ప్రేమను అంగీకరిస్తే సరే. లేదంటే ప్రేమించమంటూ బలవంతపెట్ట కూడదు. అలా చేస్తే ప్రేమ పుడుతుందో లేదో కానీ, నో చెప్పాక మనం మంచి అబ్బాయిగా ఉంటే వాళ్లకు మనపై ప్రేమ చిగురించే అవకాశాలున్నాయి.

  5. ఆ భావన... ఏ అమ్మాయికైనా చిన్నగానో, కాస్త ఎక్కువగానో అహంభావం ఉంటుంది. అదే అహంభావాన్ని మనం కూడా వారి వద్ద ప్రదర్శిస్తే.. వీడెవడో మనల్ని మించిపోయాడే అన్న భావన అమ్మాయిలు మనల్ని ప్రేమించేలా చేస్తుంది.

  6. హంగులకు లొంగక... తన ప్రేమికుడు బైక్‌, కారు, ఐఫోన్‌ లాంటి విలువైన వస్తువులు కలిగి ఉండాలని మంచి అమ్మాయిలు కోరుకోరు. ఒకవేళ అలాంటి భావాలున్న యువతి అయితే మన జీవితంలోకి ఆహ్వానించొద్దు.

  7. బయటకు తీసుకెళ్లండి. ఇంట్లో నాలుగు గోడల మధ్యే కాక సరదాగా బయట ప్రపంచం చుట్టిరావాలని అమ్మాయిలకు ఉంటుంది. ఆ అవకాశం మనం వారికి కల్పించాలి. ముఖ్యంగా రద్దీ ప్రాంతాలకు తీసుకెళ్లినప్పుడు వారి భద్రతపై మనం ఎలాంటి బాధ్యత కనబరుస్తున్నాం అన్న విషయాల్ని ఒక కంట కనిపెడుతుంటారు. అలాంటివారిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తారు.

  8. గలగలా మాట్లాడాలి. ఇది చాలా ముఖ్యం. గలగలా మాట్లాడేవారంటే అమ్మాయిలకు చాలా ఇష్టం. కొందరమ్మాయిలు హాస్య చతురతతో కూడిన మాటల్ని ఇష్టపడతారు. ఇంకొందరు సెంటిమెంట్‌ సంభాషణల్ని. అంతెందుకు మన సుత్తిని కూడా కొందరు బాగా లైక్‌ చేస్తారు.

  9. తరచూ చెబుతుండాలి... దీన్ని మాత్రం కచ్చితంగా అనుసరించాలి. అమ్మాయిలకు పదేపదే 'నేను నిన్ను ప్రేమిస్తున్నాన'ని చెబుతూ ఉండాలి. రోజుకు వంద సార్త్లెనా ఫర్వాలేదు. అదే మీ ప్రేమకు టానిక్‌ లాంటిది.

  10. మరొకరి జపం వద్దు. మన ప్రియురాలి వద్ద ఎట్టి పరిస్థితుల్లోనూ మరో అమ్మాయి గురించి పాజిటివ్‌గా మాట్లాడటమో, వారిపై పొగడ్తలు కురిపించటమో చేయకండి. ఆ సమయాన్ని మన ఇష్టసఖిని పొగిడేందుకే కేటాయిస్తే మంచిది.

  English summary
  Tamil Star hero Arya revels love techniques to youth and his fans.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X