కిక్ లో మరో హీరో?

By Staff

రవితేజ, ఇలియానా కాంబినేషన్లో రెడీ అవుతున్న కిక్ చిత్రంలో తమిళ హీరో శ్యామ్ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు.'12B" వంటి విభిన్న చిత్రంతో తమిళనాట పరిచయమైన ఈ హీరో అక్కడ మంచి విజయాలే సాధించాడు. ఇక ఈ కిక్ చిత్రంలో శ్యామ్ ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. రవితేజని పట్టుకోవటమే తన జీవితాశయం అని తిరుగుతూంటాడు. అయితే ఎప్పటికప్పుడు రవితేజ అతనికి ఝలక్ లు ఇస్తూంటాడు. ఆ తర్వాత రవితేజ అసలు మోటివ్ తెలుసుకుని అతన్ని సేవ్ చేయటానికి సహకరిస్తాడు.

ఇలియానాకి, శ్యామ్ కి వచ్చే సన్నివేశాలు హైలెట్ గా ఉంటాయని సమాచారం. ఈ సినిమాలో హిలేరియస్ గా ఇద్దరికి పెళ్లి చూపలు ఎపిసోడో ఉంటుందని తమిళ పత్రికల సమాచారం. ఇక కిక్ చిత్రాన్ని అతనొక్కడే ఫేమ్ సురేంధర్ రెడ్డి డైరక్ట్ చేస్తున్నాడు. అశోక్, అతిధి చిత్రాలకు కథలు అందించిన వక్కంతం వంశి ఈ చిత్రానికి కథ అందింస్తున్నాడు. హైదరాబాద్ ఉర్దూ కాలేజి, స్విర్టర్ లాండ్, మలేషియాలో దాదాపు నలభై ఐదు రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం పై పరిశ్రమలో మంచి అంచనాలే ఉన్నాయి. రెండు రోజుల క్రిందట ఈ చిత్రం ఆడియో రిలీజ్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X