twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టార్ హీరోలపై మీడియా కేసు..కోర్టు సమన్లు

    By Srikanya
    |

    తమిళ స్టార్ హీరోలు సూర్య, శరత్‌ కుమార్, సత్యరాజ్ పై ఊటీకి చెందిన ఓ పత్రిక కోర్టు కేసు వేసింది. దాంతో ఊటీ కోర్టు ప్రముఖ నటులు సూర్య,శరత్‌కుమార్,సత్యరాజ్,వివేక్,అరుణ్ విజయ్,విజయ్‌కుమార్,నటి శ్రీప్రియ,దర్శక నటుడు చేరన్‌కు సమన్లను జారీ చేసింది.డిసెంబర్ 12న కోర్టుకు నేరుగా హాజరుకావాలని ఆదేశించింది. వివరాల్లోకి వెళితే 2009లో జరిగిన తమిళ నటుల సంఘం సమావేశం లో దాదాపు కొట్టుకునే స్ధాయిలో గొడవలు జరిగాయి. దాంతో ఓ పత్రిక వారు దీన్ని ఉన్నదున్నట్లు కవరేజ్ చేసారు. దాంతో తమ గురించి ఇట్లా రాస్తారా అని స్టార్ హీరోలంతా మండిపడ్డారు. తమ గురించి తప్పుడు సమాచారాన్ని ప్రచురిస్తున్నారన్న ఆగ్రహంతో సూర్య, శరత్‌కుమార్, సత్యరాజ్ తదితర నటులు, దర్శకులు మీడియా ప్రతినిధులను కించపరిచేలా మాట్లాడారు.

    తమ అభిమానులను,పాఠకులను తప్పుదోవ పట్టించే లా మీడియా వ్యవహరిస్తోందని ఈ నటులు నోరు పారేసుకున్నారు. దీనిపై ఊటీకి చెందిన తమిళ పత్రిక సంపాదకుడు రోసారి యో ఊటీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారించిన కోర్టు ప్రముఖ సామాజిక కార్యకర్తలు వీరమదివానన్, తవముదల్వన్ అభిప్రాయాలను సేకరించింది. ఈ కేసు విచారణ న్యాయమూర్తి సుబ్రమణ్యం సమక్షంలోకి వచ్చింది. ఆరోపణలు ఎదుర్కొం టున్న నటులు సూర్య, శరత్‌కుమార్, సత్యరాజ్, వివేక్, అరుణ్ విజయ్, విజయ్‌కుమార్, శ్రీప్రియ, చేరన్ వచ్చే నెల 12న కోర్టుకు నేరుగా హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ పరిణామంతో ఈ గొడవ అయిపోయింది అంతా మర్చిపోయారనుకుంటున్న సమయంలో వచ్చిన ఈ సమన్లు చూసి వారంతా షాక్ కి గురి అయ్యారు. ఈ విషయాన్ని మీడియా ఎట్లా ఫోకస్ చేస్తుందో అని వారు ఆందోళన చెందుతున్నట్లు చెన్నై పరిశ్రమలో వినపడుతోంది.

    English summary
    In a defamation case filed by a local journalist, Ooty Judicial Magistrate, R Subramaniam ordered summons to be issued to eight actors including Surya, Sathya raj, Sarath kumar and Sripriya to appear before the court on December 12.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X