గదిలో బందీ అయిన 'గజనీ' సూర్య
"పాత్రపరంగా నేను కొంతకాలం జైలులో ఉంటాను. అలాగని నేను నిజంగా జైలుకు వెళ్లి అక్కడ గడపలేదు. ఖైదీ మానసిక స్థితి ఎలా ఉంటుందనేది తెలుసుకునేందుకు ఇంట్లో ఒక గదిలో బందీగా ఉన్నాను. ఆ విధంగా పాత్ర పోషణను అవగతం చేసుకున్నాను" అని గజనీ సూర్య 'రక్త చరిత్ర' చిత్రం కోసం తను పడ్డ తపనను మీడియాకు వివరించారు. అతని మాటల్లోనే..."నా ద్వారా రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా తమిళ ప్రేక్షకులకు పరిచయం కావటం ఆనందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో నివసించిన ఒక వ్యక్తి నిజ జీవితంలో జరిగిన సంఘటనలు స్ఫూర్తిగా నా పాత్రను మలిచారు. ఒక సాధారణమైన వ్యక్తి అసాధారణమైన పరిస్థితిలో చిక్కుకున్నప్పుడు అతడి మానసిక పరిస్ధితి ఏ విధంగా మారుతుంది అనే అంశాన్ని పలు మలుపులు, ఆసక్తిదాయకమైన సంఘటనలతో ఈ చిత్రం ఉంటుంది.
మరికొద్ది రోజుల్లో 'రక్త చరిత్ర' షూటింగ్ పూర్తవుతుంది. ఈ చిత్రం కేవలం పగ, ప్రతీకారం, హింస మాత్రమే కాక ఒక పాత్ర తాలూకు భావోద్వేగాల ప్రయాణాన్ని ప్రతిబింబిస్తుంది. వైవిధ్యమైన కథకు టెక్నాలజీ తోడు కావటంతో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది" అని సూర్య తెలిపారు. అలాగే హిందీ 'రక్త చరిత్ర' కోసం మదురైకు చెందిన ఒక ప్రొఫెసర్ దగ్గర సూర్య హిందీ నేర్చుకున్నారు. అంతేకాక తన భార్య జ్యోతిక సహకారంతో హిందీలో తన పాత్రకు స్వంతంగా డైలాగులు చెప్పుకున్నారు. ఇప్పటిదాకా తాను నటించిన పాత్రల్లో ఈ పాత్ర మరపురానిదిగా మిగిలిపోతుందని సూర్య చెప్పారు.


Click it and Unblock the Notifications











