యానిమల్ ట్రైనర్ గా తమిళ్ హీరో సూర్య ...
'గజిని' కాంబినేషన్ మురగదాస్, సూర్య కలిసి చేస్తున్న కొత్త చిత్రం '7 ఓం అరివు' సర్కస్ నేపధ్యంలో కథ జరగనుంది. ఈ చిత్రంలో సూర్య సర్కస్ కళాకారుడిగా అలరించేందుకు సిద్ధమవుతున్నారు. దీంట్లో సూర్య పాత్ర చుట్టూనే కథ నడుస్తుంది. యానిమల్ ట్రైనర్ గా ఓ విభిన్నమైన పాత్ర ఇది అని చెప్తున్నారు. ఈ పాత్ర కోసం సూర్య కొందరు సర్కస్ కళాకారులతో మాట్లాడినట్లు తెలిసింది. కోయంబత్తూర్ లోని గ్రేట్ ముంబై సర్కస్ లో ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం జరుగతోంది. అలాగే మరి కొన్ని సాహసోపేతమైన సన్నివేశాల కోసం చైనా వెళ్ళనున్నారని తెలుస్తోంది. శ్రుతిహాసన్ హీరోయిన్ గా చేస్తున్న రెడ్ జెయింట్ పతాకంపై నిర్మాత ఉదయనిధి స్టాలిన్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి హరీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. కె.రవిచంద్రన్ కెమెరా అందిస్తున్నారు.
సూర్య గజనీ మురగదాస్ స్టాలిన్ అమీర్ ఖాన్ అసిన్ శృతి హాసన్ surya ghajini murugadoss stalin chiranjeevi aamir khan shruti hassan


Click it and Unblock the Notifications