Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఎలా ఉన్నాడు? : సూర్య 'మాస్' లుక్(ఫొటో)
చెన్నై : తమిళ హీరో సూర్య చేసినట్లుగా అటు మాస్, ఇటు క్లాస్ రోల్స్ సౌత్ లో ఒకే సారి చేసే హీరోలు లేరనే చెప్పాలి. సికిందర్ లో తన స్టైలిష్ లుక్ లో అదరకొట్టిన సూర్య ఈ సారి పూర్తి మాస్ లుక్ తో మన ముందుకు రావటానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. అందులో భాగంగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఆయన చిత్రం చేస్తున్నారు. ఆ చిత్రానికి 'మాస్' అనే టైటిల్ పెట్టారు. ఆ చిత్రం ఫస్ట్ లుక్ మీరు చూస్తున్నది.
అజిత్, విజయ్‌ల తర్వాత వేగంగా పేరు తెచ్చుకుంటున్న నటుడు సూర్య. వైవిధ్య నటనతో తమిళ ప్రేక్షకులను మాత్రమే కాకుండా తెలుగు, కన్నడ, మలయాళ సినీజనాలకు కూడా దగ్గరయ్యారు. ఎప్పటినుంచో వెంకట్‌ప్రభు దర్శకత్వంలో సూర్య నటించనున్నట్లు వార్తలు వినిపించాయి. ఇప్పుడా ప్రాజెక్టు మొదలై రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది.
'మంగాత్తా', 'బిరియాని' విజయాలతో హవా చాటుకుంటున్న వెంకట్‌ప్రభు తాజాగా సూర్యతో మాస్‌మసాలా చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకు 'మాస్' అని పేరు కూడా పెట్టారు. స్టూడియో గ్రీన్ బ్యానరుపై కేఈ జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్నారు.
చిత్రంలో సూర్యకు సంబంధించిన సన్నివేశాలు చాలా బాగా వచ్చాయంటున్నారు. ఇందులో సూర్యకు జంటగా నయనతార, ఎమీజాక్సన్ నటిస్తున్నారు. ఎప్పటిలాగే వెంకట్‌ప్రభు తమ్ముడు ప్రేమ్‌జీ ఈ సినిమాలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.