శృతి హాసన్ కి అది జీన్స్ ఎఫెక్టు...తమిళ హీరో సూర్య
శృతి హాసన్ లాంటి నటిని నేను ఇప్పటి వరకూ చూడలేదు. మహానటుడైన తండ్రి జీన్స్ రావటం వల్లనో ఏమో గానీ... ఎలాంటి కష్టతరమైన హావభావాలనైనా ఈజీగా పలికించేస్తోంది. శృతి భవిష్యత్తులో గ్యారెంటీగా టాప్ హీరోయిన్ అవుతుంది అంటూ శృతి హాసన్ని ఉద్దేశించి తమిళ స్టార్ హీరో సూర్య అన్నారు. ప్రస్తుతం వారిద్దరూ తమిళంలో మురుగదాస్ దర్శకత్వంలో 'ఎంజుమ్ అరివు' చిత్రంలో నటిస్తున్నారు.ఆ సినిమా షూటింగ్ సమయంలో శ్రుతి నటన సూర్యకు బాగా నచ్చిందిట.
ఇక ఈ విషయాన్ని శ్రుతి ముందు మీడియావారు నిజమేనా అన్నట్లు ప్రస్తావిస్తే సూర్య వంటి హీరో అభినందించటం నటిగా నాపై నాకు నమ్మకాన్ని పెంచింది. ఆర్టిస్టులకు మొదటి జడ్డీలు లొకేషన్ లో ఉన్నవారే. అక్కడున్నవారికి మన నటన వారికి నచ్చితే మనం తొలి విజయం సాధించినట్టే. సూర్య లాంటి గొప్ప ఆర్టిస్టు ప్రశంసలు అందుకోవడం పట్ల గర్వంగా ఫీలవుతున్నాను. నటిగా, గాయనిగా, సంగీత దర్శకురాలిగా విజయాన్ని సాధించగలిగానంటే దానికి కారణం నాన్నగారే అంది. ఆమె తెలుగులో నటించిన అనగనగా ఓ ధీరుడు ఈ సంక్రాంతికి విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











