విజయ్‌కి కరోనా పరీక్షలు.. గృహ నిర్బంధంలోనే తనిఖీలు
గత నెల వరుస ఐటీ దాడులతో వార్తల్లో నిలిచిన దళపతి హీరో విజయ్ తాజాగా మరోసారి మీడియాలో ప్రముఖంగా మారారు. కరోనావైరస్ విజృంభిస్తున్న సమయంలో ఆయన ఇంటికి ఆరోగ్యశాఖ అధికారులు వెళ్లి తనిఖీలు చేయడం మీడియాలో హైలెట్ అయింది. విజయ్‌కు కరోనావైరస్ నిర్ధారణ పరీక్షలు ఎందుకు చేశారనే వార్తలు మీడియాలో గుప్పుమన్నాయి. ఈ అంశంపై వివరాల్లోకి వెళితే..

నెగిటివ్ రిపోర్ట్స్‌తో
ఇటీవల విదేశాలకు వెళ్లి విజయ్ తిరిగి వచ్చారు. ఆ కారణంగా ఆయనకు వైద్య, కరోనా పరీక్షలు నిర్వహించాం. అయితే పరీక్షల్లో నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. అలాగే ఆయన కుటుంబ సభ్యులకు కూడా తనిఖీలు నిర్వహించాం. విజయ్ కుటుంబ సభ్యులు ఎవరూ గత ఆరు నెలల్లో విదేశీయానం చేయలేదు. అందుకే ఆయన ఇంటికి ఎలాంటి స్టిక్కర్ అంటించలేదు అని వైద్య అధికారులు వివరణ ఇచ్చారు.

స్వీయ గృహ నిర్బంధంలోనే విజయ్
ప్రస్తుతం విజయ్ స్వీయ గృహ నిర్బంధంలో ఉన్నారు. ముందస్తు జాగ్రత్తగా ఆయనకు వైద్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించాం. ఇందులో అనుమాన పడాల్సిన అంశాలు ఏమీ లేవు. కాబట్టి మీడియాలో ఏవైనా రూమర్లు వస్తే అన్ని అవాస్తవాలే. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని వైద్య అధికారులు పేర్కొన్నారు.

సోషల్ డిస్టెన్స్‌ను పాటించండి
కరోనాపై పోరాటంలో భాగంగా విజయ్ సోషల్ డిస్టెన్స్‌ను పాటిస్తున్నారు. కేవలం ఆయన ఇంటికే పరిమితమయ్యారు. తన అభిమానులను కూడా ఇంటికే పరిమితం కావాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని ఇటీవల ప్రకటన చేశారు. కరోనాను వ్యాప్తి చేయకుండా నిరోధించాలని విజయ్ కోరారు.
Recommended Video

తమిళనాడులో కరోనా స్టిక్కర్ల వివాదం
విదేశీ యానం చేసి వచ్చిన సినీ ప్రముఖులు, ఇతర వ్యక్తుల ఇంటికి చెన్నై మున్సిపల్ అధికారులు కరోనావైరస్ స్టిక్కర్లు అంటిస్తున్నారు. ఈ క్రమంలో కమల్ హాసన్ ఇంటికి కరోనా స్టిక్కర్ అంటించడం వివాదంగా మారింది. ఆయన మాజీ జీవిత భాగస్వామి గౌతమి విదేశాలకు వెళ్లి రావడం, ఆ తర్వాత కమల్ చిరునామాపై ఆమె ఇంటి అడ్రస్ ఉండటంతో స్టిక్కర్ అంటించారు. దాంతో ఈ అంశం వివాదంగా మారింది.


Click it and Unblock the Notifications











