Vijayakanth Last rites: ప్రభుత్వ లాంఛనాలతో విజయ్ కాంత్ అంత్యక్రియలు.. ఎప్పుడు, ఎక్కడంటే?
తమిళ హీరో, డీఎండీకే అధినేత విజయ్ కాంత్ డిసెంబర్ 28న ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇక ఆయన మరణంతో చిత్ర పరిశ్రమలోని సెలబ్రెటీలతో పాటు.. రాజకీయ శ్రేణులు సైతం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇక ఆయన అంత్యక్రియలపై తమిళనాడు ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది. ప్రభుత్వ లాంచనాలతో విజయ్ కాంత్ అంత్యక్రియలు జరపనున్నట్లు ప్రకటించింది. ఇక విజయ్ కాంత్ అంత్యక్రియలు ఎప్పుడు, ఎక్కడ జరగనున్నాయో తెలుసుకుందాం.
తమిళ కథనాయకుడు డీఎండీకే అధినేత విజయ్ కాంత్ డిసెంబర్ 28న ఉదయం అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఇక ఆయనకు అందులోనూ కరోనా కూడా వ్యాపించందని తెలుస్తోంది. గతకొంత కాలంగా ఆయన తీవ్ర ఆనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని మాయత్ ఆస్పత్రిలో చేర్పించి అక్కడే చికిత్స చేయించారు. అయితే ఇటీవల ఆయన కాస్త కోలుకున్నారు కూడా.

తాజాగా విజయ్ కాంత్ కు కరోనా సోకడంతో చెన్నైలోని మియోట్ ఆసుపత్రిలో చేర్పించగా... చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఇక ఇప్పటికే ఆయనకు శ్వాసకోశ సమస్యలు ఉండగా.. దానికి తోడు కరోనా రావడంతో వెంటిలెటర్ పై ఉంచి చికిత్స అందించినా ఫలితం దక్కలేదు. ఇక ఈరోజు అనగా డిసెంబర్ 28న ఆయన కన్నుమూశరని తమిళనాడు ప్రభుత్వం అనౌన్స్ చేసింది. ఆయన మరణంతో సినిమా ఇండస్ట్రీలో, రాజకీయ శ్రేణుల్లో తీవ్ర విషాదం అలుముకుంది.

ఇక విజయ్ కాంత్ మృతిపై పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు.. తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. అంతే కాదు వారి కుటుంబానికి ప్రగాడ సానుభూతిని ప్రకటించారు. తాజాగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆయన భౌతికకాయానికి నివాళులర్పించి.. కుటుంబానికి సంతాపం తెలిపారు. చెన్నైలోని విజయ్ కాంత్ నివాసానికి వెళ్లిన సీఎం స్టాలిన్... ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఇక విజయ్ కాంత్ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతోనిర్వహించనున్నట్లు స్టాలిన్ తెలిపారు. ఇక విజయ్ కాంత్ అంత్యక్రియలు రేపు అనగా శుక్రవారం డిసెంబర్ 28న తమిళనాడులోని కోయంబేడులోని పార్టీ కార్యాలయంలో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయని తెలిపారు, సాయంత్ర 4.45 నిమిషాలకు తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా విజయ్ కాంత్ అంత్యక్రియలను జరపనుంది. కాగా విజయ్‌కాంత్ మరణంపై అటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా సానుభూతి తెలిపారు. ఆయన మరణం చాలా బాధాకరం, తమిళ చలనచిత్ర పరిశ్రమలో ఆయన ఒక లెజెండ్ అంటూ ట్విట్టర్ లో వెల్లడించారు.
ఇక ప్రధాని మోదీతో పాటు.. డీఎండీకే పార్టీతో పాటు... కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, సినీ ప్రముఖులు అందరూ విజయ్ కాంత్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఇక ఆయన నివాసానికి వెళ్లి నివాళులు అర్పిస్తున్నారు. ఇక విజయ్ కాంత్ మరణం... సినీ పరిశ్రమకు లోటని చాలా మంది అభిమానులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆయన కరోనా సమయంలో ఎంతో మందిని ఆదుకున్నారని... ఇప్పుడు అలాంటి కరోనా బారిన పడి చనిపోవడం బాధకరం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒక గొప్ప మనిషిని కోల్పోయాం అంటూ ఆవేదన చెందుతున్నారు.


Click it and Unblock the Notifications











