షూటింగ్ లో గాయపడ్డ విశాల్: ఆసుపత్రికి తరలింపు
"తుప్పరివాలన్" షూటింగ్ సందర్భంగా విశాల్ గాయపడ్డాడు. ఫైట్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా విశాల్ ఎడమ కాలికి గాయాలయ్యాయి. విశాల్ ను చూసేందుకు అభిమానులు ఆసుపత్రి వద్దకు తరలి వచ్చారు
సినిమా ఫైటింగ్ అంటే డూప్ ఉండటం సర్వసాధారణం, హీరో క్షేమం కోసం నిపుణులైన డూప్‌లతో యాక్షన్ సన్ని వేశాలను చిత్రీకరిస్తారు. కానీ ఈ మధ్య కాలంలో హీరోలు డూప్ లేకుండా నటిస్తున్నారు. తమ అభిమానులు తామే ఆ స్టంట్స్ చేసాం అనుకుంటారనీ వారిని నిరాశ పరచలేకే కొన్ని సాహసాలు చేస్తామని చెప్తూంటారు.
అయితే ఈ ప్రయత్నం లో అభిమానులకోసం తీవ్రంగా గాయపడుతున్నారు. ఇలాంటి సంఘటనలు దాదాపు అన్ని ఇండస్ట్రీలో చూస్తునే ఉన్నాం. తమిళ హీరో విశాల్ కూడా ఇలా స్టంట్స్ చేసే విశయం లో ముందుంటాడు.తన అభిమానుల కోసం ఆ మాత్రం చేయాల్సిందే అని చెప్తూంటాడు. ఇదివరలో కొన్ని గాయాల పాలైన విశాల్ ఇప్పుడు మళ్ళీ తన కొత్త సినిమా "తుప్పరివాలన్" షూటింగ్ సందర్భంగా విశాల్ గాయపడ్డాడు.

'తుప్పరివాలన్' షూటింగ్ లో ఓ ఫైట్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా విశాల్ ఎడమ కాలికి గాయాలయ్యాయి. వెంటనే అతన్ని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా విశాల్ ను చూసేందుకు భారీ ఎత్తున ఆయన అభిమానులు ఆసుపత్రి వద్దకు తరలి వచ్చారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











