ఆ మాయ మాటలు నమ్మే మోసపోయా...నమిత
నేను చాలా సార్లు మోసపోయాను...సినిమా కమిట్ అయ్యేటప్పుడు ఒక రకంగా, రిలీజ్ అయ్యేటప్పుడు మరో రకంగా నా సినిమాలు ఉంటున్నాయి. ఉన్నాయి..అంటోంది నమిత. సినిమాకి సైన్ చేసేటప్పుడు, 'మీ పాత్ర చాలా బాగుంటుంది. సినిమాకి మీ పాత్రనే కీలకం' అనేవాళ్లు. ఆ మాటలు నమ్మి ఒప్పుకునేదాన్ని. చివరికి ఎడిటింగ్ సమయంలో నా సన్నివేశాలను కత్తిరించేవారు. సినిమాలో నా పాత్ర నామమాత్రంగా ఉండేది. అలా ఎందుకు చేశారు? అని దర్శక, నిర్మాతలను నిలదీస్తే.. సినిమా నిడివి ఎక్కువైనందున తీసివేయాల్సి వచ్చిందని చెప్పేవాళ్లు. అంతెందుకు ఒక సినిమాలో అయితే జస్ట్ నా పాట మాత్రమే ఉంచి సన్నివేశాలను తొలగించేశారు. అదేమని అడిగితే.. సరైన సమాధానం చెప్పలేదు. ఇలాంటివి చాలా జరిగాయి' అని అంటూ తను మోసపోయిన విధానాన్ని తలుచుకుని బాధపడుతోంది నమిత. అందుకే ఇకనుంచి సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలనుకుందామని నిర్ణయించుకున్నానంటోంది. ఇద్దరు హీరోయిన్స్ ఉన్న సినిమా అయినా ఫర్వాలేదు. నా పాత్రకి మాత్రం తగిన గుర్తింపు ఉండాలంటున్నారు ఈ భారీ అందాల సుందరి.
అలాగే హీరోయిన్ గా కెరీర్ ఆరంభించిన తొలి నాళ్లల్లో నమిత ఏ సినిమా పడితే అది చేశారు. అదే మైనస్ అయ్యింది. కథలు, పాత్రలు ఎంపిక చేసే విధానంలో నమిత పొరపాట్లు చేశారు. ఆ విషయాన్ని ఆమె ఒప్పుకుంటున్నారు. అయితే కొంతమంది దర్శక, నిర్మాతలు ఆమెకొకటి చెప్పి షూటింగ్‌లో వేరే తీసేవాళ్లని చెపుతోంది. ఆ విషయం గురించి చెబుతూ గతంలో నేను నటించిన సినిమాల్లో ఒప్పందం అయినప్పుడు ఒక రకంగా, విడుదల తర్వాత మరో రకంగా ఉన్నవి చాలా ఉన్నాయి. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా అభినయానికి ఆస్కారం ఉన్నవాటిని కూడా చేయాలన్నది నా ఆకాంక్ష. అందుకు అనుగుణంగా ఉన్న పాత్రల్నే చేస్తాను. నమిత ఈ నిర్ణయాన్ని సీరియస్ గా తీసుకుంది. ఈ నాలుగు నెలల కాలంలో 14 సినిమాలు తిరస్కరించింది. రాసి కాదు..వాసి ముఖ్యం అంటోంది..నమిత. మంచి ఆలోచనే కానీ దర్శక,నిర్మాతలు ఒప్పుకోవాలి కదా. ప్రస్తుతం నమిత బాలకృష్ణ సరసన సింహా చిత్రంలో చేస్తోంది. దానిని బోయపాటి శ్రీనివాస్ డైరక్ట్ చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











