For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'జులాయి'తమిళ రీమేక్ లో అదే స్పెషల్

  By Srikanya
  |

  చెన్నై : ప్రశాంత్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'సాహసం'(జులాయి రీమేక్). ఈ సినిమాలోని ఆరు పాటలను ప్రముఖ, వైవిధ్య గాయకులతో పాడిస్తున్న విషయం తెలిసిందే. తమన్‌ సంగీతం సమకూర్చుతున్నారు. ఇటీవలే లక్ష్మీమీనన్‌ ఓ పాట పాడారు. ఇంకా శంకర్‌ మహదేవన్‌, శ్రేయాఘోషల్‌, మొహిత్‌ చౌహాన్‌, ఆండ్రియా తదితరులు పాట పాడారు. తాజాగా 'దెసి దెసి.. గాళ్‌..' అనే పాటను శింబు పాడారు.

  ఈ సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని అందించారని తమన్‌కు టయోటా కారును ప్రశాంత్‌ తండ్రి త్యాగరాజన్‌ బహుకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శింబు పాడిన పాట యువతను భారీగా ఆకట్టుకుంటుందని త్యాగరాజన్‌ అభిప్రాయపడ్డారు. జనవరి మూడో వారంలో పాటల విడుదల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  'జులాయి' గురించి గుర్తు చేసుకుంటే...

  Tamil Julai remake special

  అల్లు అర్జున్-ఇలియానా హీరో హీరోయిన్లుగా నటించిన 'జులాయి' చిత్రం ఇప్పుడు తమిళంలోకి రీమేక్ అవుతోంది. 2012 ఆగస్టు 9న విడుదలైన ఈచిత్రానికి మంచి కలెక్షన్స్ వచ్చాయి. బన్నీ కెరీర్లోనే ఈచిత్రం బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం తమిళ రీమేక్ లో ప్రశాంత్ హీరోగా చేస్తున్నాడు. ప్రశాంత్ అంటే అప్పట్లో జీన్స్ చిత్రంతో తెలుగువారికి పరిచయమైన హీరోనే. దాంతో యంగ్ హీరో అల్లు అర్జున్ చేసిన చిత్రం అక్కడ ఏజెడ్ హీరో ఒప్పుకోవటం హాట్ టాపిక్ గా మారింది. ప్రశాంత్ సొంత బ్యానర్ లో ఈ చిత్రం నిర్మిస్తున్నారు. కొత్త దర్శకుడు చిత్రాన్ని డైరక్ట్ చేస్తారు. రాజేంద్రప్రసాద్ చేసిన పాత్రలో తంబి రామయ్య కనిపించనున్నారు.

  త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బన్నీ-ఇలియానా జంటగా నటించిన ఈచిత్రం 5 వారాల్లో దాదాపు 40 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్ మార్కెట్లో 0.90 మిలియన్ డాలర్లు వసూలు చేయగా, కేరళ, కర్నాటకల్లో 5 కోట్ల వరకు రాబట్టింది. టోటల్ గా ఈచిత్రం రూ. 55 కోట్లు వసూలు చేసిందని టాక్. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై డివివి దానయ్య సమర్పణలో ఎన్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓ బ్యాంకు దోపిడీ సంఘటన చుట్టూ సాగే ఈ చిత్రంలో బన్నీ అద్భుతంగా నటించడంతో పాటు యాక్షన్ సీన్లు ఇరగదీశాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు ప్లస్సయింది.

  చిత్రం కథ ఏమిటంటే... రవీందర్ నారాయణ(అల్లు అర్జున్) తెలివైన నేటి తరం కుర్రాడు..అయితే కష్టపడకుండా ఓవర్ నైట్ లో ఎదిగిపోవాలనే కోరిక ఉన్నవాడు. అది అతని తండ్రి నారాయణ మూర్తి(తణికెళ్ల)కి నచ్చదు. ఓ రోజు తండ్రితో ఎప్పటిలాగే తగువు పడి పదివేలు పట్టుకెళ్లి ఐదు లక్షలుతో తిరిగివస్తానని క్రికెట్ బెట్టింగ్ కి వెళతాడు. అక్కడ నుంచి అతని లైఫ్ అనుకోని మలుపు తిరిగుతుంది. బిట్టు(సోనూ సూద్)అనే ఓ తెలివైన దొంగ తన గ్యాంగ్ తో చేసిన 1500 కోట్ల బ్యాంక్ దోపిడికి విట్నెస్ గా మారి.. క్రిమినల్స్ కి మోస్ట్ వాంటెడ్ గా మారతాడు. అక్కడ నుంచి పోలీసులు, క్రిమినల్స్ అతని జీవితం అయిపోతుంది. ఈ క్రమంలో అతనికో అమ్మాయి మధు(ఇలియానా) పరిచయం అవుతుంది. క్రిమినల్స్ నుంచి తప్పించుకుంటూ ఆమె ప్రేమను ఎలా దక్కించుకున్నాడు అనేది మిగతా కథ.

  English summary
  Saahasam is an upcoming Tamil action comedy film being directed by Arun Raj Varma, and produced by Thiagarajan. The film features Prashanth in the lead role. The film, which will have music composed by Thaman, began production in November 2013. The film is a remake of the Telugu film Julayi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X