రామ్ చరణ్ చిత్రానికి ఎమ్.జి.ఆర్ టైటిల్
రామ్ చరణ్,రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన మగధీర చిత్రం తెలుగులో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం తమిళంలో డబ్ చేసి రిలీజ్ చేయటానికి ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్ ధాను రైట్స్ తీసుకున్నారు. భారీ మొత్తానికి కొనుగోలు చేసిన ఈ చిత్రానికి తమిళంలో మన్నాతి మన్నన్ అనే టైటిల్ పెడుతున్నారు. ఈ టైటిల్ తమిళనాడులో 1960లో వచ్చిన ఎమ్.జి.ఆర్ సూపర్ డూపర్ హిట్ మూవీ టైటిల్. దాంతో ఈ టైటిల్ ప్రకటించగానే క్రేజ్ వచ్చింది. ఇక ఈ చిత్రం కోసం వివేక్ (తమిళ కమిడెయన్) మీద సెపరేట్ కామిడీ ట్రాక్ ఒకటి చిత్రీకరించి కలపనున్నారు. అలాగే శ్రీహరి పాత్రను కొంత ట్రిమ్ చేస్తున్నారు. మొదట శ్రీహరి పాత్రను తమిళ నటుడు చేత రీషూట్ చేద్దామనుకున్నారు కానీ...రామ్ చరణ్ కాంబినేషన్ సీన్స్ ఎక్కువగా ఉండటంతో ఆ ఆలోచన విరమవించుకున్నారు. అలాగే ఏ రీషూట్ లేకుండా అరుంధతిని డైరక్ట్ గా రిలీజ్ చేసినట్లుగానే చేస్తే వర్కవుట్ అవుతుందని మరికొందరు సలహా ఇస్తున్నారు. ఇక రామ్ చరణ్ చేత తమిళంలో డబ్బింగ్ చెప్పిస్తానని అల్లు అరవింద్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక బంగారు కోడి పెట్ట పాటని తమిళంలో సూపర్ హిట్ అయిన మరో పాట రీమిక్స్ తో మార్చి చేయటానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











