అల్లు అరవింద్ కు చెప్తే నా కథను కాపీ కొట్టాడు
రామ్ చరణ్, కాజల్ కాంబినేషన్లో రాజమౌళి రూపొందించిన మగధీర చిత్రం వందరోజులు విజయవంతంగా పూర్తి చేసుకుని దూసుకుపోతోంది. ఆ విజయాన్ని పురస్కరించుకుని తమిళంలో ఈ చిత్రాన్ని డబ్ చేసి రిలీజ్ చేయాలని అల్లు అరవింద్ ప్లాన్ చేసారు. అయితే అనుకోనివిధంగా దానికో అడ్డంకి వచ్చి పడింది. ఈ కథ తనదేనంటూ ఓ తమిళ రైటర్ అక్కడ సౌత్ ఇండియన్ ఫిల్మ్ అసోశియేషన్ లో కేసు ఫైల్ చేసారు. అంతేకాక తాను గతంలో ఈ కథను అల్లు అరవింద్ కు నేరేట్ చేసానని, ఆయన మోసం చేసారని ఆరోపించాడు. అయితే ఆ రచయిత పేరును పబ్లిక్ చేయటానికి ఇష్టపడటం లేదు. ఏదైనా రాజీ జరుగుతుందని ఎదురుచూస్తున్నట్లు సమాచారం. అతనికి కాంపన్సేషన్ ఇస్తాడని ఆశిస్తున్నారు. అంటే అతనికి ఈ మగధీర కథ నాదేనంటూ తెలుగులో జరిగిన గొడవ తెలియదన్న మాట. అదీసంగతి.
అల్లు అరవింద్ రాజమౌళి రామ్ చరణ్ తేజ్ కాజల్ తమిళ రైటర్ కీరవాణి మగధీర గ్రాఫిక్స్ allu aravind rajamouli ram charan kajal tamil writer keeravani magadheera


Click it and Unblock the Notifications