టాలీవుడ్ హీరోలపై కక్ష కట్టిన తమిళ మీడియా
మన పొరుగు రాష్ట్రం తమిళనాడు మీడియా టాలీవుడ్ హీరోపై కక్ష్య కట్టింది. కావాలని మన హీరోలను టార్గెట్ చేస్తూ ఫుంఖానుపుంఖంగా పుకార్లను వదులుతోంది. అర్థం పర్థం లేని వార్తలతో మొన్నా మధ్య నాగచైతన్య నానా ఇబ్బందులు పెట్టి..తాజాగా నందమూరి హీరో బాలయ్యను బదనాం చేస్తోంది.
నాగ చైతన్యతో అనుష్క పెళ్లి...అంటూ ఆ మధ్య తమిళ మీడియా కూసిన కూతలు ఏ రేంజ్ లో దుమారం రేపాయో..., ఈ వార్తలు చూసిన ఎవరికైనా ఇదో పచ్చి అబద్దం అని అనిపించక తప్పదు. నాగచైతన్య తండ్రి నాగార్జునతో అనుష్కకు లింకు ఉందని గతంలో వచ్చిన వార్తలు కాస్త ఓకే, కస్త నమ్మశక్యంగా ఉన్నారు. కానీ...అనుష్క వయసుకు? నాగచైతన్య ఏజ్ ఎక్కడైనా పొంతన ఉందా?...
ఇప్పుడే బాలయ్యను టార్గెట్ చేస్తూ కథనాలు అల్లుతోంది. 'నయన తార ఒప్పుకుని ఉండక పోతే తాను కూడా ఈ సినిమా చేసే వాడిని కాదేమో" అంటూ ఇటీవల శ్రీరామరాజ్యం ఆడియో వేడుకలో బాలయ్య చేసిన వ్యాఖ్యలు... తమిళ మీడియా చేతికి కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లయింది. దీన్ని ఆసరాగా చేసుకుఃని బాలయ్య మీదన పడి వార్తలతో రక్కేస్తోంది.
బాలయ్యకు నయన తారతో లింకు అంటగట్టడమే కాదు....నయనతార-ప్రభుదేవా సీతారాములతో పోల్చుతూ, బాలయ్య ను రావణుడిగా పోల్చుతూ ప్రభుదేవా దగ్గర నుంచి బాలయ్య నయనను ఎగరసేకుపోతాడేమో? అనే అనుమానం వ్యక్తం రాతలు రాసింది.
రాముడిలా ఏక పత్నీ వ్రతుడైన బాలయ్యను రావణుడితో పోల్చడం ఏమిటి?.... వివాహ బంధాన్ని అపహాస్యం చేస్తున్నట్లు ప్రవర్తిస్తున్న ప్రభుదేవ-నయనతార లాంటి వారిని సీతారాములుగా పోల్చడం ఏమిటి? ఇందులో ఏమైనా అర్థం ఉందా? ఇలాంటి వార్తలు ప్రచారం చేయడం కక్ష్య కట్టి విషప్రచారం చేయడం కాకుంటే మరేమిటి? అని అభింమానులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











