నేనే దేముడ్ని

దాదాపు రెండేళ్ళు ఈ చిత్ర నిర్మాణానికి పట్టింది.భవిష్యత్తును మాట్లాడటం,వేరే మానసిక ప్రపంచంలో సంచరించటం వంటి వాటిల్లో నిష్టాణులు అయిన సాధువుల జీవన శైలి,ప్రవర్తన,ఎదుర్కొనే సవాళ్ళు వంటివి ఇందులో చర్చించబోతున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ చిత్రంలో ఆర్య సాధువుగా కనిపిస్తే...పూజ ఓ గుడ్డి బిచ్చగత్తెగా గా కనిపించనుంది. స్టార్ డమ్ పట్టించుకోకుండా అత్యంత సహజ పాత్రలతో ఈ చిత్రాన్ని తీసారని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక మాస్ట్రో ఇళయరాజా అందించిన సంగీతం మొన్న జనవరి మొదటి తేదీన రిలీజై సంచలనం సృష్టిస్తోంది. ఇక నాన్ కడవుల్ అంటే నేనే దేముడ్ని అని అర్ధం .కధాంశం గురించి దర్శకుడు బాలా చెబుతూ మనిషిలో ఉండే భగవంతుడ్ని ఆవిష్కరించటమే ఈ సినిమా లక్ష్యం అన్నారు.


Click it and Unblock the Notifications











