Vijay Party Flag: దళపతి విజయ్ కి బిగ్ షాక్.. ఆ విషయంపై ఈసీకి బీఎస్పీ ఫిర్యాదు

Vijay Party Flag: తమిళ్ స్టార్ హీరో విజయ్ ఇటీవలే ప్రత్యేక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల ఓ రాజకీయ పార్టీ ని కూడా పెట్టిన సంగతి తెలిసిందే. ఆ పార్టీకి 'తమిళ వెట్రి కజగం'(Tamizhaga Vetri Kazhagam)అని నామకరణం కూడా చేశారు. అయితే.. ఇప్పుడు పార్టీ స్థాపించిన తమిళనాడులో జరిగే 2026 అసెంబ్లీ ఎన్నికల్లోనే పోటీ చేస్తానని, అంతకంటే ముందు జరిగే ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయనని స్పష్టం చేసాడు.

అప్పటి వరకూ పార్టీ బలోపేతానికి తాను కష్టపడుతాననీ, ప్రజల కష్టాలను క్షేత్రస్థాయిలోకి వెళ్లి తెలుసుకుంటానని తన ప్యూచర్ ఫ్లాన్ ప్రకటించారు. ప్రస్తుతం విజయ్ చేతిలో పలు సినిమాలున్నాయి. వాటి షూటింగ్ పూర్తి చేసి.. వచ్చే ఏడాది నుంచి దళపతి విజయ్ రాజకీయాలపై ఫుల్ ఫోకస్ పెట్టబోతున్నడని టాక్.

Tamil Nadu BSP files complaint with poll panel over actor Vijay s party Tamilaga Vettri Kazhagam flag

ఇదిలా ఉంటే.. ఇటీవల విజయ్ తన పార్టీ జెండాని ఆవిష్కరించారు. చెన్నైలో తన పార్టీ కార్యాలయంలో చాలా గ్రాండ్ గా లాంచ్ చేశారు. తన పార్టీ కార్యాలయంలో విజయ్‌ ఈ జెండాను ఎగురవేశారు. విజయ్ తమిళ వెట్రి కజగం పార్టీ జెండా లో పైన కింద రెడ్ కలర్ ఉండగా.. మధ్యలో పసుపు కలర్ ఉంది. మధ్యలో రెండు ఏనుగులు. వాటి మధ్యలో మధ్యలో ఒక పువ్వు వికసించినట్టు, దాని చుట్టూ చుక్కలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ మాట్లాడుతూ జెండా ప్రత్యేకత గురించి మాట్లాడాడు.

భారత దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన యోధులను, తమిళనాడు హక్కుల కోసం అలుపెరగని పోరాటం వారిని తాము ఎప్పటికీ గుర్తుంచుకుంటామనీ, కులం, మతం, లింగం, ప్రాంతం పేరిట జరుగుతున్న వివక్షను తాము తొలగిస్తామని ప్రకటించారు. ప్రజలందరికీ సమానహక్కులు, అవకాశాల కోసం తాము కృషి చేస్తాం. సమానత్వం అనే తన పార్టీ అజెండా అని ప్రకటించారు.

అయితే.. ఇక్కడ వరకు అంత బాగున్నా.. తాజాగా విజయ్ పార్టీ జెండాపై వివాదంలో నెలకొంది. విజయ్ పార్టీ జెండాపై బహుజన్ సమాజ్ పార్టీ.. ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. బీఎస్పీ తమ ఫిర్యాదులో.. హీరో విజయ్ టీవీకే పార్టీ జెండాపై ఏనుగుల గుర్తు తమ పార్టీలోని గుర్తును పోలి ఉందని, తమ పార్టీ జెండాలో ఏనుగు గుర్తును ఉపయోగించారని, ఈ విషయంపై చర్యలు త్రీసుకోవాలని డిమాండ్ చేసింది బీఎస్పీ. జెండాపై ఏనుగుల గుర్తును తొలగించాలని బీఎస్సీ డిమాండ్ చేస్తుంది. ఇలా ఆదిలోనే హంస పాదులా .. పార్టీ ప్రారంభించిన తొలి సారే.. దళపతికి బిగ్ షాక్ తగలిందని అనుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X