Rajanikanth ఉన్న హాస్పిటల్ కి సీఎం స్టాలిన్.. సర్జరీ జరిగిందని తెలియడంతో హుటాహుటిన!
తమిళ పరిశ్రమ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల చెన్నైలోని కావేరి హాప్సిటల్‌లో చేరారు, ఆయన కరోటిడ్ ఆర్టరీ రివాస్కులరైజేషన్ సర్జరీ చేయించుకున్నాడు. ఇక ఆయన త్వరలో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఆదివారం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆసుపత్రిలో రజనీకాంత్ ని పరామర్శించారు. ఆయన పర్యటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే

ఫోటోలు వెలుగులోకి రాలేదు కానీ
ఆదివారం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆసుపత్రిలో రజనీకాంత్ ని పరామర్శించారు. సీఎం, రజనీకాంత్ కలిసినప్పుడు ఫోటోలు వెలుగులోకి రాలేదు కానీ ఎంకె స్టాలిన్ కారు ఆసుపత్రి నుండి బయటకు వస్తున్న విజువల్స్ ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా, రజనీ కాంత్ పరిస్థితిని వెల్లడించిన ఆస్పత్రిలో ఇటీవల మెడికల్ బులెటిన్ విడుదల చేసింది, అతను కోలుకుంటున్నాడని బులెటిన్‌లో పేర్కొంది.

కరోటిడ్ ఆర్టరీ రివాస్కులరైజేషన్ సర్జరీ
తమిళ సూపర్ స్టార్, తలైవా రజనీకాంత్ వేగంగా కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. రెండు, మూడు రోజుల్లో ఆయనను డిశ్చార్జి చేసే అవకాశం ఉందని కావేరి ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మూడు రోజుల క్రితం తలనొప్పి, జ్వరం, భుజం నొప్పితో రజనీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు వెంటనే రజనీని చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేర్పించారు. ఇక రజనీ కరోటిడ్ ఆర్టరీ రివాస్కులరైజేషన్ సర్జరీ చేయించుకున్నారు.

ఆరోగ్యంపై ఆరా
ఈ పరిస్థితిలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. ఆళ్వార్‌పేటలోని కావేరీ ఆసుపత్రికి వెళ్లిన రజనీకాంత్‌ను స్టాలిన్ పరామర్శించి ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. అలాగే రజనీకి అందిస్తున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అలాగే. 'ప్రియ మిత్రుడు రజనీకాంత్, మీరు త్వరగా కోలుకుని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటున్నాను' అని ముఖ్యమంత్రి స్టాలిన్ తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు.

సోషల్ మీడియాలో హల్ చల్
అక్టోబర్ 28న రజనీకాంత్ సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం కావేరి ఆస్పత్రిలో చేరారు. రజనీకాంత్ భార్య లత మరియు రజనీకాంత్ బృందం ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పగా, రజనీకాంత్ సన్నిహిత వర్గాలు మాత్రం రజనీకాంత్ ఛాతీ నొప్పి మరియు అసౌకర్యంతో హాస్పిటల్ లో చేరినట్టు వెల్లడించారు. ఇక స్టాలిన్ కారు కావేరి ఆస్పత్రి నుంచి బయటకు వస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

అన్నాత్తే విడుదల కోసం
మరో పక్క , రజనీకాంత్ తన రాబోయే సినిమా అన్నాత్తే విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహించగా సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించారు. ఈ చిత్రంలో నయనతార, కీర్తి సురేష్ మరియు ఖుష్బూ కూడా నటించారు. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా చాలా ఆలస్యం అయిన తర్వాత, ఈ చిత్రం నవంబర్ 4 న దీపావళికి విడుదల కానుంది.
Recommended Video

తెలుగులో పెద్దన్న పేరుతో
ఇదే సినిమాను తెలుగులో పెద్దన్న పేరుతో విడుదల చేస్తున్నారు. దసరా పండగ సందర్భంగా తెలుగులో ఈ సినిమాకు 'పెద్దన్న' టైటిల్ ఖరారు చేస్తూ ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. 'పెద్దన్న' సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. తెలుగులో ఈ సినిమా హక్కులను ఏషియన్ సినిమాస్.. రూ. 12 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. గతంలో రజినీకాంత్ సినిమాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ.


Click it and Unblock the Notifications











