CM Vijay:విజయ్-సంగీత మధ్య సయోధ్య ? త్రిష పేరు మళ్లీ చర్చల్లోకి!

CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు స్టార్ హీరో,దళపతి విజయ్. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రజల నుంచి అపూర్వమైన మద్దతు పొందిన ఆయన నాయకత్వం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే.. సీఎం విజయ్ వ్యక్తిగత జీవితం గురించి ఇండస్ట్రీ వర్గాల్లో, సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇంతకీ ఆ వార్తలేంటీ? అసలేం జరిగింది?

గత కొంతకాలంగా విజయ్, ఆయన భార్య సంగీత మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలు సోషల్ మీడియా, సినీ వర్గాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా వీరిద్దరూ తమ మధ్య ఉన్న మనస్పర్థలను పక్కనపెట్టి మళ్లీ ఒక్కటయ్యారనే ప్రచారం తమిళనాట హాట్ టాపిక్‌గా మారింది. వాస్తవానికి గత కొన్నేళ్లుగా దళపతి విజయ్.. తమిళ రాజకీయాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించిన విషయం తెలిసిందే. రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత ఆయన వ్యక్తిగత జీవితంపై కూడా అనేక రకాల కథనాలు వెలువడ్డాయి.

Tamil Nadu CM Vijay-Sangeetha Reunion Rumours Create Buzz Trisha name Trending

ముఖ్యంగా సీఎం విజయ్ భార్య సంగీత పలు కీలక కార్యక్రమాల్లో కనిపించకపోవడం, రాజకీయ సభలు, ముఖ్యమైన అధికారిక వేడుకలకు హాజరు కాకపోవడం వల్ల ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. దీంతో వీరిద్దరి మధ్య దూరం మరింత పెరిగిందనే రూమర్స్ జోరందుకున్నాయి. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. కుటుంబ సభ్యుల జోక్యంతో పరిస్థితులు మారినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్ ఇరువురితో మాట్లాడి అపార్థాలను తొలగించే ప్రయత్నం చేసినట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

కుటుంబ బంధాలు, రాజకీయ భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ సయోధ్యకు అటు విజయ్, ఇటు సంగీత అంగీకరించినట్టు, దీంతో సయోధ్య సుగమమైందని అంటున్నారు. అయితే.. ఈ వార్తలపై విజయ్ కుటుంబం లేదా అధికారిక వర్గాల నుంచి ఎలాంటి ధృవీకరణ రాలేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ముఖ్యంగా రాజకీయ నాయకుడిగా విజయ్ ఇమేజ్‌ను బలోపేతం చేయడంలో కుటుంబం కలిసికట్టుగా ఉండటం కీలకమని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉంటే, ఈ ప్రచారాల నేపథ్యంలో నటి త్రిష పేరు కూడా మరోసారి వార్తల్లోకి వచ్చింది. గతంలో విజయ్, త్రిష గురించి వచ్చిన పుకార్లను సోషల్ మీడియా మళ్లీ తెరపైకి తీసుకువస్తోంది. సంగీత విడాకులు నోటీసులు పంపిన మరుసటి రోజే విజయ్ త్రిష ఇద్దరూ కలిసి ఓ ప్రైవేట్ పార్టీకి హాజరయ్యారు. అలాగే.. ఇటీవల తమిళ స్టార్ అజిత్ తల్లి మరణించగా, అతని కుటుంబాన్ని పరమర్శించడానికి త్రిష విజయ్ ఇద్దరూ కలిసి వచ్చారు. దీంతో ఈ వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అనే వార్తలు వచ్చాయి.

అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ప్రచారాలపై ఇప్పటివరకు ముఖ్యమంత్రి విజయ్ కార్యాలయం గానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ అధికారికంగా స్పందించలేదు. దీంతో ప్రస్తుతం వినిపిస్తున్న వార్తలన్నీ ఊహాగానాలుగానే పరిగణించాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు విజయ్ అభిమానుల్లో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ సయోధ్య వార్తలను నమ్ముతుండగా, మరికొందరు ఇవన్నీ నిరాధార ప్రచారమేనని కొట్టిపారేస్తున్నారు.

Read more about: vijay trisha kollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X