1,20,000 ఓట్ల తేడాతో యువ హీరో విజయం.. తమిళనాడులో దుమ్మురేపిన కాంగ్రెస్ అభ్యర్థి
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో యువ నటుడు విజయ్ వసంత్ దుమ్మురేపాడు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తొలిసారి ఎన్నికల బరిలో దిగిన విజయ్ వసంత్ రికార్డు స్థాయి మెజారిటీని సాధించాడు. కన్యాకుమారి అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి పోన్ రాధాకృష్ణన్‌పై సంచలన విజయం సాధించారు.
విజయ్ వసంత్ విషయానికి వస్తే.. తమిళనాడులో సీనియర్ కాంగ్రెస్ నేత కుమారి ఆనందన్ మేనల్లుడైన విజయ్ వసంత్ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతేడాది కోవిడ్ వ్యాధితో తండ్రి వసంత కుమార్ మరణించడంతో రాజకీయాల్లోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

దాంతో కన్యాకుమారి పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేసిన విజయ్ వసంత్ తన ప్రత్యర్థిపై 1,20,000 ఓట్లకుపైగా ఓట్లతో విజయం సాధించారు. తమిళనాడు 2021 ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఇంతటి విజయాన్ని అందుకొన్న నటుడు ఈయనే అని సినీ, రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
విజయ్ వసంత్ కెరీర్ విషయానికి వస్తే.. పలు తమిళ చిత్రాల్లో నటించి మెప్పించారు. చెన్నై 600028, ఎన్నామో నడకుథు లాంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు.


Click it and Unblock the Notifications











