సినీ ప్రియులకు బ్యాడ్ న్యూస్: ఆక్యూపెన్సీని తగ్గించేందుకు సిద్ధం అయిన రాష్ట్ర ప్రభుత్వం

ఇండియాలో సినిమాలకు లభించే ఆదరణ మరే దేశంలోనూ కనిపించదు. మరీ ముఖ్యంగా దక్షిణాదిలో ఇది ఎక్కువగా ఉంటుంది. అలాంటిది గత సంవత్సరం కరోనా వైరస్ చూపించిన ప్రభావం వల్ల లాక్‌డౌన్ ప్రకటించడం.. దీంతో థియేటర్లు మూతపడడం జరిగిపోయాయి. దాదాపు ఎనిమిది నెలల తర్వాత అంటే గత డిసెంబర్ నుంచి కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. సంక్రాంతి సీజన్‌లో సైతం ఇలాగే సినిమాలు ప్రదర్శితం అయ్యాయి. కరోనా ప్రభావం తగ్గడానికి తోడు వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరందుకోవడంతో ఫిబ్రవరి 1 నుంచి వంద శాతం ఆక్యూపెన్సీతో నడుస్తున్నాయి.

అయితే, కొద్ది రోజులుగా కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. దేశ వ్యాప్తంగా రోజుకు లక్షకు పైగానే పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు థియేటర్లలో సీటింగ్ కెపాసిటీని యాభై శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ క్రమంలోనే తాజాగా తమిళనాడులో ఆక్యూపెన్సీని యాభై శాతానికి తగ్గించబోతున్నారని ఓ వార్త బయటకు వచ్చింది. ఈ మేరకు గురువారమే మినిస్ట్రీ ఆఫ్ ఇన్‌ఫర్‌మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ విభాగం నుంచి ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 Tamil Nadu theatres occupancy capped at 50 percent on COVID-19 surge in the state

తమిళనాడులో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ కారణంగా గతంతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు అక్కడ థియేటర్ల ఆక్యూపెన్సీని తగ్గించాలని మినిస్ట్రీ ఆఫ్ ఇన్‌ఫర్‌మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అలాగే, కొన్ని మార్గదర్శకాలను కూడా విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే థియేటర్ యాజమాన్యాలు పాటించాల్సి స్టాండర్డ్ ఆపరేషన్ ప్రోటోకాల్స్‌లో సవరణలు చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X