twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    త్రిష, శింబు, వడివేలుపై వేటు? నిర్మాతల మండలి కఠిన చర్యలు

    By Rajababu
    |

    Recommended Video

    త్రిష, శింబుపై ప్రముఖ నిర్మాత ఫైర్

    నిర్మాతలను నష్టాలకు గురిచేశారనే ఆరోపణలపై తమిళ అగ్ర నటులు శింబు, త్రిష, వడివేలుపై మూడేళ్ల వేటు పడే అవకాశం ఉన్నట్టు కనిపిస్తున్నది. నిర్మాతలు తీవ్రంగా నష్టపోవడానికి కారణమయ్యారనే అంశంపై తమిళ నిర్మాతల మండలి కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నది. విజయ్ ఆంటోని నటించిన అన్నాదురై ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో ఇటీవల తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా వీరిపై ధ్వజమెత్తడం వివాదంగా మారిన సంగతి తెలిసిందే. వీరిపై ఫిర్యాదులు అందిన నేపథ్యంలో నిర్మాతల మండలి చర్యలు తీసుకోవడానికి సిద్ధపడుతున్నట్టు సమాచారం.

     రోజూ శింబు సెట్‌కు లేటుగా

    రోజూ శింబు సెట్‌కు లేటుగా

    హీరో (శింబు) 29 రోజులు షూటించే చేస్తే దాదాపు ప్రతీ రోజు సెట్‌కు లేటుగా వచ్చేవాడు. కేవలం మొక్కుబడిగా నాలుగు గంటలు షూటింగ్‌లో ఉండి వెళ్లిపోయేవాడు. షూట్ చేసిన 30 శాతంతోనే సినిమాను రిలీజ్ చేద్దాం అని ఒత్తిడి చేశాడు.

     మైఖేల్ రాయప్పన్‌కు 18 కోట్ల నష్టం

    మైఖేల్ రాయప్పన్‌కు 18 కోట్ల నష్టం

    నా సినీ జీవితంలో ఎంతో అంకితభావం చూపే యాక్టర్లను చూశాను. నా జీవితంలో అలాంటి నటుడిని ఇంత వరకు చూడలేదు. మైఖేల్ రాయప్పన్ అనే నిర్మాత 18 కోట్లు నష్టపోవడానికి ఓ హీరో (శింబు) కారణమయ్యాడు అని నిర్మాత జ్ఞానవేల్ రాజా అన్నారు.

    త్రిష సామి2 గుడ్‌బై

    త్రిష సామి2 గుడ్‌బై

    విక్రమ్ నటిస్తున్న సామీ2 చిత్రం నుంచి ఉన్నపళంగా హీరోయిన్ త్రిష వైదొలగడంతో తాను నష్టపోయాను అని నిర్మాత మండలికి ప్రొడ్యూసర్ ఫిర్యాదు చేశారు. క్రియేటివ్ డిఫెరెన్స్ కారణంగా త్రిష తాను నటించనని ఆ సినిమాను నుంచి తప్పుకొన్న సంగతి తెలిసిందే.

     శంకర్‌తో గొడవపడిన వడివేలు

    శంకర్‌తో గొడవపడిన వడివేలు

    ఇమ్‌సాయి అరసన్ అనే చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రంలో నటించడానికి వడివేలు అంగీకరించాడు. ఆ తర్వాత నిర్మాత, రోబో2 దర్శకుడు శంకర్‌తో విభేదాలు రావడంతో ఆ సినిమా ఆగిపోయింది. దాంతో తాను కొంత మొత్తం నష్టపోయాను అని నిర్మాత శంకర్ ఫిర్యాదు చేశారు.

     త్రిష, వడివేలు, శింబుపై యాక్షన్

    త్రిష, వడివేలు, శింబుపై యాక్షన్

    తమిళ చిత్ర పరిశ్రమలో శింబు, త్రిష, వడివేలు వ్యవహారం చర్చనీయాంశమైంది. వీరిపై కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. వీరిపై ఏ మేరకు చర్యలు తీసుకొంటారో వేచి చూడాల్సిందే.

    English summary
    Tamil producer Gnanavel Raja of Studio Green lashed out recently at popular Tamil actors Simbu, Vadivelu and Trisha for their unprofessional behaviour . Simbu attended only 29 days of shooting for producer Michael Rayappan'sproduction AAA directed by Adhik Ravichandran. The film failed miserably at the box office. Vadivelu's sequel to Tamil comedy Imsai Arasan is rumoured to have been shelved, owing to his fight with producer Shankar, the director of 2.0 . The producer of Saamy 2 wants action to be taken on Trisha as she walked out of the project citing creative differences, just as they were about to shoot her part.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X