Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
హద్దులు దాటేలా ముద్దులు, లెస్బియన్ సన్నివేశాలు.. సమాజాన్ని భ్రష్టు పట్టించే సినిమా!
హీరోయిన్ ఓవియా పేరు ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో మారుమోగుతోంది. ఓవియా తమిళ బిగ్ బాస్ 1 లో పాల్గొంది. అంతకు ముందు కూడా ఓవియా హీరోయిన్ గా నటించింది. కానీ ఒవియాకు ఎలాంటి గుర్తింపు లభించలేదు. బిగ్ బాస్ షోలో పాల్గొన్న తర్వాత ఓవియా జాతకం ఒక్కసారిగా మారిపోయింది. లక్షలాది మంది ఆమెకు అభిమానులుగా మారిపోయారు. ఈ షో తర్వాత ఓవియా నటిస్తున్న తొలి చిత్రం 90 ఎంఎల్. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విమర్శలపాలవుతోంది. అందుకు కారణం ఈచిత్రంలో హద్దులు దాటేలా అడల్ట్ కంటెంట్ ఉండడమే.
డివైడ్ టాక్
ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన 90 ఎంఎల్ చిత్రానికి ప్రేక్షకుల నుంచి డివైడ్ టాక్ వస్తోంది. ఓవియా అభిమానులే 90 ఎంఎల్ చిత్రపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ విమర్శిస్తున్నారు. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు కనీసం చూడలేని విధంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ చిత్రాన్ని మహిళా దర్శకురాలు అనిత ఉదీప్ తెరకెక్కించారు. ఓవియా, అనితపై సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్ జరుగుతోంది.
హద్దులు దాటేలా
90 ఎంఎల్ చిత్రాన్ని కేవలం యువతే టార్గెట్ గా తెరెక్కించారు. ఓవియాతో పాటు ఆమె స్నేహితురాళ్ళు మద్యం సేవించడం, హద్దు దాటేలా ముద్దు సన్నివేశాలు, లెస్బియన్ సన్నివేశాలే ప్రధానంగా చూపించారు. దీనితో 90 ఎంఎల్ చిత్రంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. తాజాగా ప్రముఖ తమిళ నిర్మాత ధనుంజయన్ 90 ఎంఎల్ చిత్రం గురించి సోషల్ మీడియాలో స్పందించారు.
సమాజాన్ని భ్రష్టు పట్టించేలా
90 ఎంఎల్ చిత్రం సమాజాన్ని భ్రష్టు పట్టించేలా ఉందని ధనుంజయన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ధనుంజయన్ విమర్శలకు 90 ఎంఎల్ దర్శకురాలు అనిత వెటకారంగా బదులిచ్చింది. మీరు నిర్మించిన మిస్టర్ చంద్రమౌళి చిత్రంలో అస్లీల పాటలకు నేను దర్శకురాలిని కాదు అని బదులిచ్చింది. దీనికి ధనుంజయన్ బదులిస్తూ..నా చిత్రాల్లో పాటలు గ్లామరస్ గా ఉంటాయి తప్ప వల్గర్ గా ఉండవని అన్నారు.
మీతో బోర్ కొడుతోంది
నా చిత్రాలకు యూఏ సర్టిఫికెట్ వచ్చింది. మీలాగా 'ఏ' సర్టిఫికెట్ సినిమాలు చేయను అని ధనుంజయన్ అన్నారు. అనిత మరింత వెటకారంగా బదులిస్తూ మీతో వివాదం బోర్ కొట్టేలా ఉంది. కొంచెం స్మార్ట్ గా మాట్లాడండి. పారిపోకండి అని అనిత వెటకారం ప్రదర్శించింది. సోషల్ మీడియాలో ఎదురవుతున్న ట్రోలింగ్ కు ఈ దర్శకురాలు ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి.