twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గుండెపోటుతో ప్రముఖ నిర్మాత కృష్ణకాంత్ కన్నుమూత.. దొంగ దొంగది చిత్రంతో

    |

    ప్రముఖ తమిళ నిర్మాత ఎస్‌కే కృష్ణకాంత్ (54) కన్నుమూశారు. సెప్టెంబర్ 30వ తేదీ బుధవారం రాత్రి తీవ్రమైన గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. కొద్దివారాలుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. బుధవారం రాత్రి చెన్నైలోని ఆయన నివాసంలో గుండెపోటుకు గురై మరణించారు అని సన్నిహితులు తెలిపారు.

    ఎస్‌కే కృష్ణకాంత్‌కు భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు చంద్రకాంత్, ఉదయకాంత్ ఉన్నారు. కృష్ణకాంత్ అంత్యక్రియలు అక్టోబర్ 1వ తేదీ సాయంత్రం చెన్నైలో జరుగుతాయి అని కుటుంబ సభ్యులు తెలిపారు.

    Tamil Producer SK Krishnakanth died due to cardiac arrest

    తమిళంలో అభిరుచి కల నిర్మాతగా కృష్ణకాంత్ పేరు తెచ్చుకొన్నారు. ధనుష్‌తో తిరుడా తిరుడి, శింబుతో మన్మథన్, విక్రమ్‌తో కింగ్ చిత్రాలు నిర్మించారు. తిరుడా తిరుడి చిత్రం దొంగ దొంగది, మన్మథుడు చిత్రం మన్మథుడు పేరుతో తెలుగులో రిలీజ్ అయ్యాయి. తిరుడా తిరుడి చిత్రం నిర్మాతగా ఆయనకు మొదటి చిత్రం కావడం గమనార్హం.

    కృష్ణకాంత్ మరణం వార్తతో తిరుడా తిరుడి దర్శకుడు సుబ్రమణ్యం శివ తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. సోషల్ మీడియాలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు. ఆయన ఆత్మకు శాంతి కలుగాలని, కుటుంబానికి మనోధైర్యం కలిగించాలని భగవంతుడిని సుబ్రమణ్యం వేడుకొన్నారు.

    English summary
    Thiruda Thirudi producer SK Krishnakanth died due to Cardiac Arrest in chennai. He was 54 years. SK Krishnakanth produced Tamil films including Dhanush's Thiruda Thirudi, Simbu's Manmadhan and Vikram's King.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X