కిరాయి మనుషులతో గెంటించాడు: విజయ్ కుమార్‌పై కూతురు ఫిర్యాదు!
Recommended Video

సినీయర్ నటుడు విజయ్ కుమార్, అతడి 4వ కూతురు వనిత వ్యవహారం రోజు రోజుకూ ముదురుతోంది. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం చర్చనీయాంశం అయింది. సినిమా షూటింగ్ కోసమని తన ఇంటిని రెంటుకు తీసుకున్న వనిత.... దాన్ని ఖాళీ చేయడానికి నిరాకరిస్తోందంటూ ఇటీవల విజయ్ కుమార్ చెన్నైలోని మధురవాయిల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆమెను ఇల్లు ఖాళీ చేయించడానికి అధికారులు అక్కడికి వెళ్లగా వారిని, మీడియా వారిని తరిమికొట్టింది. అనితను అరెస్టు చేసేందుకు పోలీసులు వెళ్లగా అప్పటికే ఆమె అక్కడి నుండి పరారైంది.

విజయ్ కుమార్ మీద వనిత రివర్స్ ఫిర్యాదు
అక్కడి నుండి పరారైన వనిత చెన్నైలోని వడపళనిలోని పోలీస్ స్టేషన్లో తన తండ్రి విజయ్ కుమార్ మీద ఎదురు ఫిర్యాదు ఇచ్చింది. తన తండ్రి విజయ్ కుమార్ కిరాయి మనుషులతో తనను కొట్టించాడని, ఇంటి నుండి గెంటించాడని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

సినిమా వాళ్లవ్వడంతో ఎవరూ ఇల్లు అద్దెకు ఇవ్వడం లేదు
ఫిర్యాదు అనంతరం వనిత మీడియాతో మాట్లాడుతూ..... తన తండ్రి విజయ్ కుమార్ బలవంతంగా తనను ఇంటి నుండి బయటకు పంపారు. సినిమా వాళ్లకు బయట ఇల్లు అద్దెకు ఎవరూ ఇవ్వడం లేదు. అలాంటిది తాను ఎక్కడ ఉండాలని ఈ సందర్భంగా వనిత ఆవేదన వ్యక్తం చేసింది.

అమ్మ ఇంట్లో ఉంటున్నాను
తన తండ్రి విజయ్ కుమార్ తనపై కూతురు అనే కనీస జాలి కూడా చూపడం లేదని, తన పరిస్థితి దయనీయంగా ఉందని, ప్రస్తుతం అమ్మ ఇంట్లో ఉంటున్నట్లు వనిత వెల్లడించారు. తన తండ్రిపై తగిన చర్యలు తీసుకోవాలని కంప్లయింటులో పేర్కొన్నట్లు తెలిపారు.

విజయ్ కుమార్
విజయ్ కుమార్‌కు మొత్తం 6 ఆరుగురు సంతానం. కవిత, అనిత, అరుణ్ విజయ్, వనిత, ప్రీత, శ్రీదేవి. వరుణ్ విజయ్ తమిళ చిత్రాల్లో హీరోగా, విలన్‌గానూ రాణిస్తున్నాడు. అతడు నటించిన ‘చిక్క చివంత వానమ్' సెప్టెంబర్ 27న విడుదలకు సిద్దమవుతోంది. వనిత, ప్రీత, శ్రీదేవి సినిమాల్లో నటించినప్పటికీ పెళ్లి తర్వాత నటనకు దూరం అయ్యారు.


Click it and Unblock the Notifications











