ప్రకాష్ రాజ్ నిజస్వరూపం ఇదే.. అసలు బాగోతాన్ని బయటపెట్టిన తమిళ నిర్మాత!
ప్రస్తుతం దక్షిణాది సినిమా దగ్గర మంచి రసవత్తర వాతావరణమే నెలకొంది అని చెప్పాలి. సినిమాలు మరీ అంత లేకపోయినప్పటికీ సినిమా వాళ్ళకి చెందిన పలు వార్తలు, కాంట్రవర్సీలు సినీ వర్గాల్లో ట్రెండింగ్ గా మారుతున్నాయి. అంతే కాకుండా పలువురు పర్శనల్ లైఫ్ కి సంబంధించిన కాంట్రవర్సీలతో పాటుగా మరికొందరు సినీ రాజకీయ సెలెబ్రెటీలు చేస్తున్న పరస్పర కామెంట్స్ పెను దుమారానికే దారి తీస్తున్నాయి.
కాగా సౌత్ ఇండియా సినిమా దగ్గర విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. అయితే ప్రకాష్ రాజ్ సినిమాల్లో విలన్ గా ఎంతో మెప్పించారు. కానీ రియల్ లైఫ్ లో కూడా కొన్ని కొన్ని ట్రిగ్గరింగ్ చర్యలు మాత్రం హాట్ టాపిక్ గా నిలుపుతున్నాయి. కాగా ఈ మధ్య అయితే మరింత స్థాయిలో ప్రకాష్ తాజ్ తన సోషల్ మీడియా ద్వారా చాలా మందిని గిచ్చుతున్నారు.

సరే ఎవరి లాజిక్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి కానీ అందరికీ సూక్తులు చెబుతూ వేదాలు వల్లిస్తున్న ప్రకాష్ రాజ్ కి ఇప్పుడు షాకింగ్ ట్విస్ట్ ఎదురయ్యింది. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరూ సినిమాకి చెందినవారే అలాగే ఉపముఖ్యమంత్రులు అయినప్పటికీ సనాతన ధర్మం విషయంలో పవన్ ఉదయనిధి స్టాలిన్ ని టార్గెట్ చేస్తే ప్రకాష్ రాజ్ పవన్ ని ప్రతి అంశంలో విమర్శిస్తూ ఉదయనిధి స్టాలిన్ కి సపోర్ట్ చేస్తున్నాడు.
అలా ఉదయనిధి స్టాలిన్ తో పెట్టిన ఓ పోస్ట్ కి తమిళ నిర్మాత పెట్టిన రిప్లై ప్రకాష్ రాజ్ కి గట్టి దెబ్బగా మారింది. ఇన్ని రోజులు సూక్తులు రూపంలో విమర్శలు గుప్పించిన ప్రకాష్ రాజ్ ని కోలీవుడ్ నిర్మాత వినోద్ కుమార్ ఏకి పారేసారు. నీతో కూర్చున్న ముగ్గురు ఎన్నికల్లో గెలిచారు కానీ నువ్వో డిపాజిట్ కూడా కోల్పోయావు. అదే వాళ్ళకి నీకు ఉన్న తేడా.. నీవల్ల షూటింగ్ సెట్ లోనే నాకు 1 కోటి రూపాయల నష్టం వచ్చింది.

నీ క్యారివాన్ నుంచి చెప్పా పెట్టకుండా మాయం అయ్యిపోయావు. కారణం ఏంటి? నాకు కాల్ చేశా అని చెప్పావు కానీ నాకు చెయ్యలేదు అంటూ పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది. ఇక దీని తర్వాత మరిన్ని డీటెయిల్స్ ఇస్తూ వినోద్ కుమార్ మరో పోస్ట్ పెట్టడం జరిగింది. ఇదంతా ఎప్పుడో కాదు మొన్న సెప్టెంబర్ 30న 2024 లోనే జరిగింది అని రివీల్ చేశారు.
ఆరోజున మొత్తం 1000 కి మందికి పైగా జూనియర్ ఆర్టిస్ట్ లు మేము అంతా సడెన్ గా షాకయ్యాము. వేరే ఏదో ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ వచ్చింది అని కనీసం చెప్పకుండా వెళ్లిపోయాడని అప్పటికే ప్రకాష్ రాజ్ తో నాలుగు రోజుల షెడ్యూల్ ని మేము ప్లాన్ చేసుకుంటే ఇలా చేసి వెళ్లిపోయాడని పూర్తి డీటెయిల్స్ తో ప్రకాష్ రాజ్ బాగోతాన్ని బయటపెట్టి వినోద్ కుమార్ షాకిచ్చాడు. కాగా వినోద్ కుమార్ నుంచి గత ఏడాదే క్రేజీ టైం ట్రావెల్ హిట్ "మార్క్ ఆంటోనీ" వచ్చింది ఇప్పుడు మరో సినిమా చేస్తుండగా ఆ సినిమాలో ప్రకాష్ రాజ్ మూలాన జరిగిన నష్టాన్ని చేదు అనుభవాన్ని తాను షేర్ చేసుకోవడం జరిగింది.


Click it and Unblock the Notifications











