వడివేలు మెడకు బిగుస్తున్న ఉచ్చు.. కఠిన చర్యలు తప్పవా?
Recommended Video

హింసించే రాజు 24వ పులకేసి చిత్ర వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. తాను రూపొందించే సినిమా ఆలస్యం కావడం వల్ల తాను ఎంతో నష్టపోయానని తమిళ నిర్మాతల సంఘానికి ప్రముఖ నిర్మాత శంకర్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో హింసించే రాజు 24వ పులకేసి చిత్రం షూటింగ్‌కు వెంటనే హాజరుకావాలని నిర్మాతల మండలి షరతు విధించింది. అలాగే బేషరతుగా షూటింగ్‌కు హాజరుకావాలని, అలాగే స్క్రిప్టులో జోక్యం చేసుకోకూడదని ఆదేశించింది.

హింసించే 24వ రాజు పులకేసి
హింసించే రాజు 24వ పులకేసి చిత్ర వివాదాన్ని పరిష్కరించుకొనేందుకు తాజాగా తమిళ నిర్మాతల మండలిని వడివేలు కలిశారు. అయితే మండలితో వడివేలు భేటి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదని సమాచారం.

రూ.1 కోటి రెమ్యునరేషన్
అంతేకాకుండా చిత్రానికి ఇవ్వాల్సిన కోటి రూపాయల రెమ్యునరేషన్‌ను నిర్మాత చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని వడివేలు సూచించడంపై నిర్మాత మండలి అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో వడివేలుకు మండలి అల్టిమేటం జారీ చేసినట్టు తెలిసింది.

వడివేలుకు రూ.9 కోట్లు
హింసించే రాజు 24వ పులకేసి చిత్ర షూటింగ్ ఆగిపోయినందున నిర్మాత శంకర్ తీవ్ర నష్టాలకు గురయ్యారు. అతడికి కలిగిన నష్టాన్ని పూడ్చేందుకు వడివేలుకు రూ.9 కోట్లు చెల్లించాలని వడివేలును ఆదేశించినట్టు తెలిసింది. ఒకవేళ వడివేలు స్పందించకపోతే తీవ్రమైన చర్యలు తీసుకోవడానికి మండలి సిద్ధమవుతున్నట్టు సమాచారం.

సోలో హీరోగా వడివేలు
కమెడియన్‌గా రాణిస్తున్న తరుణంలో హింసించే రాజు 23వ పులకేసి చిత్రంలో వడివేలుకు హీరోగా శంకర్ అవకాశం ఇచ్చారు. ఆ చిత్రానికి శింబుదేవన్ దర్శకత్వం వహించారు. ఆ చిత్రం తర్వాత వడివేలు సోలో హీరోగా కొన్ని చిత్రాలు చేశారు. దానికి సీక్వెలుగా వస్తున్న 24వ పులకేసిలో మళ్లీ హీరోగా నటించే అవకాశం ఇవ్వగా అది వివాదంగా మారింది.


Click it and Unblock the Notifications











