పెద్ద హీరోలకు షాక్: తమిళ నిర్మాత సంచలన నిర్ణయం

By Bojja Kumar

హైదరాబాద్: సౌతిండియాలో తమిళ సినీ పరిశ్రమది ప్రత్యేక స్థానం. తమిళ సినిమాలకు కేవలం తమిళనాడులోనే కాకుండా పొరుగు రాష్ట్రాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. సింగపూర్, మలేషియా, యూఎస్ లాంటి దేశాల్లోనూ తమిళ చిత్రాలకు మార్కెట్ ఉంది. రజనీకాంత్, అజిత్, విజయ్, సూర్య లాంటి ఇండియా వైడ్ గుర్తింపు ఉన్న స్టార్స్ ఉన్నారు.

అయితే సినీ పరిశ్రమలో చాలా కాలం నుండి ఓ సమస్య తిష్టవేసి ఉంది. ముఖ్యంగా రిలీజ్ డేట్స్ చిన్ని సినిమాలకు, పెద్ద స్టార్ల సినిమాలకు మధ్య సమస్యలకు ప్రధాన కారణం. భారీ బడ్జెట్ పెద్ద సినిమాలు భారీగా థియేటర్లు ఆక్రమించడంతో చిన్న సినిమాలకు తక్కువ థియేటర్లు మాత్రమే లభిస్తున్నాయి. దీంతో వారు నష్టాల పాలవుతున్నారు.

ఈ నేపథ్యంలో తమిళ నిర్మాతల మండలి ఈ రోజు ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. రూ. 15 కోట్లు, అంతకు మించిన బడ్జెట్‌తో తెరకెక్కే భారీ సినిమాల సంవత్సరంలో నిర్ణయించిన 10 హాలీడేస్(పండగలు, పబ్లిస్ హాలిడేస్)లో మాత్రమే విడుదల చేసుకోవాలని నిర్ణయించారు.

Tamil producers' shocking decision

ఈ లిస్టులో... ఏప్రిల్ 14(తమిళ న్యూఇయర్), మే 1, ఆగస్టు 15, సెప్టెంబర్ 17, అక్టోబర్ 21, నవంబర్ 10(దీపావళి), డిసెంబర్ 25.... లాంటివి ఉన్నాయి. ఈ నిర్ణయం చిన్న సినిమాలకు ప్రోత్సాహంగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఈ నిర్ణయం పెద్ద సినిమా నిర్మాతలను కలవరానికి గురి చేస్తోంది. ఒకే రోజు రెండు మూడు పెద్ద సినిమాలు రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే పరిస్థితి ఏమిటి? కావాల్సినన్ని థియేటర్లు దొరకక నష్టాలు తప్పవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి తమిళ నిర్మాతల మండలి నిర్ణయం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X