తమిళ ‘అర్జున్ రెడ్డి’ ఫస్ట్ లుక్ పోస్టర్ చూశారా?
తెలుగునాట సంచలన విజయం సాధించిన కల్ట్ మూవీ 'అర్జున్ రెడ్డి' మూవీ తమిళంలో చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో దీనికి 'వర్మ' అనే టైటిల్ ఫైనల్ చేశారు. రేపు ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ ఫస్ట్ లుక్ విడుదలవ్వాల్సి ఉండగా... ఒకరోజు ముందే లీక్ అయింది.
ధృవ్ ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం అవుతున్నాడు. ప్రముఖ తమిళ దర్శకుడు బాలా ఈ చిత్రాన్ని హ్యాండిల్ చేస్తున్నాడు. తమిళ నేటివిటీకి తగిన విధంగా కొన్ని మార్పులు చేసినా సినిమాలోని రానెస్ మాత్రం అలానే ఉంచారట.

సెప్టెంబర్ 23న ధృవ్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ ప్లాన్ చేశారు. తెలుగు వెర్షన్ 'అర్జున్ రెడ్డి'కి సంగీతం అందించిన రాధన్ తమిళ వెర్షన్ 'వర్మ'కు సంగీతం అందిస్తున్నారు. లీకైన పోస్ట్ చూస్తుంటే లుక్ అంతగొప్పగా ఏమీ లేదనే వాదన వినిపిస్తోంది.
అయితే దర్శకుడు బాలా హ్యాండిల్ చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ఈ ప్రాజెక్టుపై అంతా నమ్మకంగా ఉన్నారు. మరి చియాన్ విక్రమ్ కుమారుడిని హీరోగా ఎలా ప్రజంట్ చేస్తాడో సినిమా విడుదలైతే తప్ప ఓ నిర్ణయానికి రాలేం.


Click it and Unblock the Notifications











