శింబుతో టాలీవుడ్ హీరోయిన్ అఫైర్.. ఇక బ్యూటీ చాప్టర్ క్లోజెనా?
తమిళ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్నారు శింబు. తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన చిత్రాలకు తెలుగు ప్రేక్షకుల నుంచి కూడా ఫ్యాన్స్ ఉన్నారు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ లతో ఎప్పుడూ యువతను సర్ప్రైజ్ చేస్తూనే వచ్చారు. ఈయన చిత్రాలు తెలుగు వెర్షన్ లోను రిలీజ్ అవడంతో విశేష ఆదరణ పొందారు.
ఇదిలా ఉంటే శింబు... తరచుగా తన పర్సనల్ లైఫ్ గురించి వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా తను హీరోయిన్లతో రిలేషన్ లో ఉన్నట్టుగా రూమర్లు పుట్టుకస్తూనే ఉంటాయి. మంట లేనిదే పొగరాదు అన్నట్టు శింబు విషయంలో ఆ రూమర్లు కూడా నిజం అవుతూ వస్తుంటాయి. గతంలో శింబు పలువురు హీరోయిన్లతో పీకల్లోతు ప్రేమలో మునిగితేలారని కోలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి. ముగ్గురు స్టార్ హీరోయిన్లతో శింబు ప్రేమ కథ నడిచిందని ఇప్పటికి ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే.

స్టార్ హీరోయిన్, లేడీ పవర్ స్టార్ నయనతార, శింబు రిలేషన్ షిప్ ను కొన్నాళ్లపాటు సాగించారనే వార్తలు ఉన్నాయి. వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నా అది ఎందుకో సెట్ అవ్వలేదు. ఇక వెంటనే బ్రేకప్ చెప్పేశారు. ఆ తర్వాత నయనతార తన లైఫ్ లో బిజీ అయింది. శింబు నెక్స్ట్ మరో స్టార్ హీరోయిన్ త్రిష తో ప్రేమలో పడ్డారు అంటూ మళ్ళీ వార్తలు వచ్చాయి. అది కొన్నాళ్లపాటు సాగింది. ఆ తర్వాత రూమర్లకు అడ్డు కట్ట పడింది.
అంతేకాదు శంభు టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ హన్సికతోను ప్రేమలో మునిగితేలారంటూ ప్రచారం సాగింది. ఇక వీరిద్దరూ ఓ సందర్భంలో సోషల్ మీడియా వేదికగానే తాము వెడ్డింగ్ ప్లాన్స్ లో ఉన్నట్టు కూడా తెలియజేసినట్టు సోషల్ మీడియా పోస్టులు కూడా వైరల్ అయ్యాయి. ఆ కథ ముగిసిన తర్వాత ఇక రెండేళ్ల కిందనే టాలీవుడ్ కి చెందిన మరో యంగ్ హీరోయిన్ తో శింబు డేటింగ్ ప్రారంభించారని వార్తలు పుట్టుకొచ్చాయి.
ఆ యంగ్ హీరోయిన్ ఎవరో కాదు... టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే షైన్ అవుతున్న నిధి అగర్వాల్. బాలీవుడ్ లో మున్నా మైకల్ చిత్రంతో తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఎదుగుతోంది. సవ్యసాచి, మజ్ను, ఇస్మార్ట్ శంకర్, హీరో.. వంటి వరుస చిత్రాలతో ఆకట్టుకున్న నిధి అగర్వాల్ నెక్స్ట్ ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో వెండితెరపై అలరించబోతుంది. అయితే ఈ క్రమంలోనే నిధి అగర్వాల్ లవ్ లైఫ్ గురించి వార్తలు బయటికి వచ్చాయి.
నిధి అగర్వాల్ మూడేళ్లుగా తమిళ సీనియర్ హీరో శింబుతో ప్రేమలో ఉన్నట్టు మళ్లీ వార్తలు వచ్చాయి. అంతేకాదు ఈసారి ఏకంగా శింబు ఇంటికి తన మాకాం కూడా మార్చుకుందని తెలుస్తోంది. ఇక త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో కూడా ఉన్నట్టు కూడా సమాచారం అందుతుంది. అందుకోసమే నిధి అగర్వాల్ షిఫ్ట్ అయింది అని అంటున్నారు. ఇక పెళ్లి చేసుకుని కెరీర్ ను క్లోజ్ చేస్తుందా? అని అంటున్నారు. ఇక దీనిపై నిధి అగర్వాల్ ఎలా స్పందిస్తారో చూడాలి. మే 9 న మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లుతో నిధి అగర్వాల్ ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో వైపు శింబు లోకనాయకుడు కమలహాసన్ నటించిన మణిరత్నం డైరెక్షన్లోని థగ్ లైఫ్.. చిత్రంలో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











