మరో సీనియర్ కమెడియన్ కన్నుమూత.. వరుస విషాదాలతో ప్రముఖుల తీవ్ర దిగ్బ్రాంతి
తమిళ సినీ పరిశ్రమను విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో ప్రముఖ కమెడియన్ వివేక్, దర్శకుడు కేవీ ఆనంద్, ఇతర ప్రముఖులు తమిర, పాండు లాంటి వారిని కోలీవుడ్ కోల్పోయింది. దీంతో చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది.
ఇలాంటి విషాదాల నుంచి తమిళ సినీ పరిశ్రమ తేరుకోక ముందే మరో సీనియర్ కమెడియన్ నెల్లై శివ మృతి వార్త తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న నెల్లై శివ మంగళవారం సాయంత్ర కన్నుమూశారు. దీంతో మరోసారి తమిళ సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది.

ప్రముఖ దర్శకుడు పాండియారాజన్ రూపొందించిన ఆన్ పావహ అనే ప్రజాదరణ పొందిన చిత్రంతో తమిళ సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. దాదాపు 100కుపైగా చిత్రాల్లో నటించారు.
తమిళ చిత్రాల్లో ఆయన డైలాగ్ డెలీవరీ ప్రత్యేకమైన శైలిలో ఉండేది. తిరునల్‌వేలి ప్రాంతపు భాషతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నారు. తాజాగా తమిళంలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన పాండియన్ స్టోర్స్ టెలివిజన్ సీరియల్‌తో విశేషంగా బుల్లితెర వీక్షకులను ఆకట్టుకొన్నారు. ఇలా కెరీర్ పరంగా ముందుకెళ్తున్న సమయంలో ఆకస్మిక మరణించడంపై సినీ ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మృతి సంతాపం తెలియజేస్తున్నారు.


Click it and Unblock the Notifications











