హిట్టిచ్చిన సీనియర్ దర్శకుడిని రిజెక్ట్ చేసిన విజయ్.. కావాలనే..?
ఒక సినిమా సక్సెస్ అయితే హీరోతో పాటు దర్శకుడికి కూడా భారీ స్థాయిలో క్రేజ్ అందుతుంది. ముఖ్యంగా కోలీవుడ్ లో అయితే చాలా మంది దర్శకులు హీరోల రేంజ్ లో వారి స్థాయిని పెంచుకుంటున్నారు. ప్రస్తుత కాలంలో టాలెంట్ ఉన్న యువ దర్శకులు చాలా మంది ఉన్నారు. తమిళ్ హీరోలలో ఉన్న మంచితనం ఏమిటంటే చిన్న దర్శకుడు చిన్న హిట్టు కొట్టినా కూడా పెద్ద సినిమా చేయమని అవకాశం ఇస్తారు.
ఇక విజయ్ కూడా అదే తరహాలో అవకాశం ఇస్తూ ఉంటాడు. మాస్టర్ సినిమా తెరకెక్కించిన లోకేష్ అంతకుముందు కార్తీతో ఖైదీ అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. అసలు మ్యాటర్ లోకి వస్తే సౌత్ లోనే బెస్ట్ కాంబినేషన్స్ లలో ఒకటైన మురగదాస్, విజయ్ జోడి మొదటిసారి క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. దర్శకుడు మురుగదాస్ విజయ్ తో తుపాకి, కత్తి సినిమాలతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.

సర్కార్ సినిమా కూడా భారీ స్థాయిలో సక్సెస్ అవుతుందని అనుకున్నారు. కానీ ఆ సినిమా అంచనాలకు తగ్గట్లు ఆడలేదు. అయితే విజయ్ మాస్టర్ అనంతరం మురగదాస్ తోనే సినిమా చేయడానికి సన్ పిక్చర్స్ తో డీల్ సెట్ చేసుకున్నాడు. ఆ సినిమా తుపాకి కథకు సీక్వెల్ అని కూడా టాక్ వచ్చింది.
కానీ కథ పూర్తిస్థాయిలో నచ్చకపోవడంతో విజయ్ తో పాటు నిర్మాతలు కూడా ఇంట్రెస్ట్ చూపడం లేదట. విషయం అర్థం చేసుకున్న మురగదాస్ కూడా కాస్త హార్ట్ అయినట్లు టాక్. ఇక సైలెంట్ గా ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడని కూడా తెలుస్తోంది. ఇక విజయ్ ఒక యంగ్ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా కథనాలు వెలువడుతున్నాయి.


Click it and Unblock the Notifications











