పొలిటీషియన్లే స్టార్ హీరోలని దిగతొక్కుతున్నారు...
సినిమా స్టార్లు గతంలో అయితే ఈజీగా పొలిటికల్ లీడర్లు కాగలిగేవారు కానీ ఈ రోజుల్లో మాత్రం అది చాలా కష్టం. అదీ సొంతంగా పార్టీ పెట్టి సక్సెస్ కావాలంటే అది మరీ కష్టం. చిరంజీవి, విజయకాంత్, శరత్ కుమార్ తదితరులని చూసి రాజకీయాల్లోకి వచ్చి కొత్త పార్టీ పెట్టాలనే కోరిక ఉన్నసినిమా హీరోలు కూడా ఇప్పుడు ఏదో ఒక పార్టీలో చేరిపోవాలని అనుకుంటున్నారు. అయితే ఒక పార్టీలో చేరితే మరో పార్టీ వాళ్లకి శత్రువులు కావాల్సి వస్తుందిగా మరి.
అయితే ఒక పార్టీలో చేరితే మరో పార్టీ వాళ్లకి శత్రువులు కావాల్సి వస్తుందిగా మరి. అలానే తమిళ స్టార్ హీరో విజయ్ కూడా జయలలిత పార్టీలో చేరాలని అనుకోవడంతో అతడిపై కరుణానిధి వర్గీయులు కత్తి కట్టారు. విజయ్ ని రకరకాలుగా ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. అతని సినిమాలు విడుదల కాకుండా, థియేటర్లు దొరక్కుండా అడ్డు తగులుతున్నారు. 'కావలన్" అనే విజయ్ సినిమా రాజకీయాల కారణంగా సినిమా థియేటర్లు ఇవ్వకుండా కరుణానిధి అభిమానులు అడ్డుకొంటున్నారు. ఆ సినిమానీ, విజయ్ నీ ఆదుకోవడానికి ఇప్పుడు జయలలితే స్వయంగా కల్పించుకుంటోంది.


Click it and Unblock the Notifications











