ఫస్ట్ లుక్: తమిళ స్టార్ విజయ్ నెక్ట్స్ మూవీ ‘సర్కార్’
వరుస విజయాలతో దూసుకెళుతున్న తమిళ స్టార్ విజయ్ త్వరలో 'సర్కార్' మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ జూన్ 22న విజయ్ బర్త్ డే సందర్భంగా విడుదల చేశారు. విజయ్ స్టైలిష్ లుక్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది.
విజయ్ కెరీర్లో 62వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీకి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. రెహమాన్ సంగీతం, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ ఈ సినిమాకు మరింత హైలెట్ కానున్నాయి.
విజయ్ గత చిత్రాలు తేరి, మెర్సల్ బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. విజయ్- మురుగదాస్ కాంబినేషన్లో వచ్చిన 'తుపాకి' సంచలన విజయం అందుకుంది. ఈ నేపథ్యంలో 'సర్కార్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభిమానులు ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ల్లో షేర్ చేస్తుండటమే ఇందుకు కారణం. మరో వైపు తమిళనాడు వ్యాప్తంగా శుక్రవారం విజయ్ ఫ్యాన్స్ తమ హీరో బర్త్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. రక్తదానం, అన్నదానం లాంటి కార్యక్రమాలతో అభిమాన సంఘాలు సెలబ్రేషన్స్ మూడ్లోకి వెళ్లిపోయాయి.



Click it and Unblock the Notifications











