కెప్టెన్ విజయ్‌కాంత్ హెల్త్ బులెటిన్.. భార్య ప్రేమలతకు కూడా కరోనా పాజిటివ్

కరోనా కారణంగా ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణించడం సినీ అభిమానులను విషాదంలోకి నెట్టింది. ఇంకా ఆ చేదు ఘటన నుంచి బయట పడటకముందే సీనియర్ నటుడు, డీఎండీకే అధినేత, కెప్టెన్ విజయ్‌కాంత్, ఆయన సతీమణి ప్రేమలత విజయ్‌కాంత్‌ కోవిడ్ బారిన పడ్డారు. గత కొద్ది రోజులుగా స్వల్ప ఆరోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో వారిద్దరూ కోవిడ్19 పరీక్షలు చేయించుకోగా కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. కొద్ది రోజుల క్రితం కెప్టెన్ విజయ్‌కాంత్ కరోనాపాజిటివ్ అని తేలడంతో చెన్నైలోని ఎంఐఓటీ ఇంటర్నేషనల్ హాస్పిటల్‌లో చేరిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన భార్యకు కూడా కరోనా పాజిటివ్ అని తేలడంతో చికిత్స కోసం హాస్పిటల్‌లో చేరారు.

ఈ క్రమంలో కెప్టెన్ విజయ్‌కాంత్ దంపతుల ఆరోగ్యంపై హాస్పిటల్ వర్గాలు హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. కెప్టెన్ విజయ్ కాంత్ భార్య ప్రేమలతకు కూడా కరోనాపాజిటివ్ అని తేలడంతో సెప్టెంబర్ 29వ తేదీన హాస్పిటల్‌లో చేరారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. వైద్యులు ఆమె పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు అని హెల్త్ బులెటిన్‌లో తెలిపారు.

Tamil Star Vijaykanth Health update: wife premalatha tested Coronapositive too

ఇక విజయ్ కాంత్ ఆరోగ్యం మెరుగుపడింది. కొన్ని ప్రాథమిక వైద్య పరీక్షలు జరిపిన తర్వాత ఆయనను హాస్పిటల్ నుంచి డిశ్చార్జి చేస్తాం. ఆయనకు ప్రస్తుతం కరోనా లక్షణాలు పూర్తిగా తగ్గిపోయారు. వైద్య చికిత్సకు పూర్తిగా స్పందిస్తున్నారు అని హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు.

సీనియర్ హీరో కెప్టెన్ విజయ్ కాంత్‌ డీఎండీకే పార్టీని స్థాపించి వ్యవస్థాపకుడిగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఆయన భార్య ప్రేమలత పార్టీ కోశాధికారి బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X