విజయ్ ఇకలేడు.. .. #RIPactorVijay అంటూ.. అజిత్ ఫ్యాన్స్ నిర్వాకం
Recommended Video
తమిళ సూపర్‌స్టార్ విజయ్, అజిత్ అభిమానుల మధ్య గొడవలు తీవ్ర స్థాయికి చేరుకొన్నాయి. సోషల్ మీడియాలో జరుగుతున్న వారి మధ్య జరుగుతున్న యుద్ధంతో హీరో ప్రతిష్ట రోడ్డు మీద పడింది. హీరో విజయ్ ఇకలేరు.. ఆయన ఆత్మకు శాంతి కలుగాలని అజిత్ ఫ్యాన్స్ చేస్తున్న ట్వీట్లు అత్యంత వివాదంగా మారాయి. ఈ గొడవపై సినీ ప్రముఖులు, నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ వివాదంపై తాజా క్రికెటర్ అశ్విన్ రవిచంద్రన్ మండిపడ్డారు. అజిత్, విజయ్ ఫ్యాన్స్ మధ్య వివాదం ఏంటి? అశ్విన్ ఏమన్నారంటే..

ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా
గత కొద్దికాలంగా విజయ్, అజిత్ ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఈ మధ్య జరిగిన సోషల్ మీడియాలో చోటుచేసుకొన్న ఓ చిన్న సంఘటనతో అజిత్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. #RIPactorVijay అంటూ సోషల్ మీడియాలో అజిత్ ఫ్యాన్స్ భారీగా ట్రోల్స్ చేస్తున్నారు.

క్రికెటర్ అశ్విన్ ఫైర్
#RIPactorVijay హ్యాష్ ట్యాగ్‌తో అజిత్ చేస్తున్న సోషల్ మీడియా దాడిపై తమిళనాడుకు చెందిన ప్రముఖ క్రికెటర్ అశ్విన్ రవిచంద్రన్ తీవ్రంగా స్పందిచారు. యువతరం చేస్తున్న పనులపై తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కాడు. ఎన్నో సమస్యలు తమిళ ప్రజలను వెంటాడుతుంటే ఫ్యాన్స్ పేరుతో ఈ పిచ్చి పనేంటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్నో సమస్యల్లో ప్రజలుంటే
మన భూగ్రహాన్ని కొద్ది రోజుల క్రితం ఓ గ్రహ శకలం ఢీకొట్టింది. రుతుపవనాలు లేకపోవడం వల్ల ఎన్నో నగరాలు నీటి కొరతతో అల్లాడుతున్నాయి. దేశంలో పలు ప్రాంతంలో కరువు తాండవిస్తున్నది. హింసాత్మక సంఘటనలతో క్రిమినల్ రెచ్చిపోవడంపై చర్చ జరుగుతున్నది. అలాంటి పరిస్థితుల్లో #RIPactorVijay అని ట్యాగ్ చేయడం సరైనదా? అని ప్రశ్నించారు.

స్టార్ హీరోలు చొరవ తీసుకోవాలని
ఫ్యాన్స్ మధ్య గొడవలు ముదిరిపోవడంపై విజయ్, అజిత్ ముందుకొచ్చి స్పందించాలని పలువురు సూచిస్తున్నారు. ఫ్యాన్స్ తీరు వల్ల తమిళ పరిశ్రమ ప్రతిష్ఠ దిగజారేలా ఉంది. ఇద్దరు అగ్రహీరోలు మౌనం దాల్చితే ఈ గొడవ మరింత రెచ్చిపోయే ప్రమాదం లేకపోలేదు. కాబట్టి ఇద్దరు హీరోలు చోరవ తీసుకోవాలి అని పలువురు ప్రముఖులు సూచిస్తున్నారు.

బిగిల్‌తో విజయ్.. పింక్ రీమేక్‌తో అజిత్
ప్రముఖ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో స్టార్ హీరో విజయ్ బిగిల్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం దీపావళీకి విడుదల కానున్నది. ఇదిలా ఉంటే, అజిత్ నటించిన నెర్కొండ పార్వాయి చిత్రం ఆగస్టు 8వ తేదీన రిలీజ్ కానున్నది. ఈ చిత్రం హిందీలో ఘన విజయం సాధించిన పింక్ చిత్రానికి రీమేక్. ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్‌ను కూడగట్టుకొన్నది.


Click it and Unblock the Notifications











