నేనేంటి పవన్ కి డబ్బింగ్ చెప్పడమేంటి...సూపర్ స్టార్
పవన్ కళ్యాణ్ 'పంజా" ప్రస్తుతం టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ స్టిల్స్ బైటకు వచ్చిన దగ్గరి నుంచి ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాబర్ట్ జాక్సన్ గా పవన్ నటించిన ఈ చిత్రం డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆడియోని ఈ నెల13న గ్రాండ్ గా రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేశారు అయితే చిత్రానికి సంగీతం అందించిన యువన్ శంకర్ రాజా మదర్ ఇటీవల చనిపోవడంతో ఆడియో ఫంక్షన్ ని ఈనెల 19కివాయిదా వేశారు.
తమిళ దర్శకుడు విష్ణువర్థన్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ 'పంజా' సినిమాని తమిళంలోకి కూడా డబ్ చేసి, ఒకేసారి తెలుగు వెర్షన్ తో బాటుగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి మనకు తెలుసు.
తమిళ వెర్షన్లో పవన్ పాత్రకి హీరో తమిళ సూపర్ స్టార్ అజిత్ డబ్బింగ్ చెబుతాడని కూడా వార్తలొచ్చాయి. అయితే, ఈ వార్తల్ని తాజాగా హీరో అజిత్ ఖండించాడు. ఈ వార్త తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందనీ, అసలు ఆ నిర్మాతలెవరూ తనని సంప్రదించలేదనీ, అదీగాక మరొకరికి తాను డబ్బింగ్ చెప్పడమేమిటని అజిత్ అంటున్నాడు. ఈ వార్తలు ఎవరు పుట్టించారో తెలియడం లేదు అంటున్నారు అజిత్. పంజా చిత్ర దర్శకుడు విష్ణువర్ధన్, అజిత్ మంచి స్నేహితులు కావడంతో ఈ వార్తలు పుట్టి ఉంటాయని కోలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.


Click it and Unblock the Notifications











